'నిబంధనలు పాటించకపోతే వైరస్ విజృంభించే అవకాశం'
కరోనా మహమ్మారి వ్యాప్తిపై ఐసీఎమ్మార్ అనుబంధ సంస్థ ఎన్‌ఐఎన్, సీసీఎంబీ, భారత్ బయోటెక్ సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్‌లో సీరో సర్వేని నిర్వహించాయి. ఈ ఏడాది జనవరి తొలివారం నుంచి దాదాపు రెండు నెలలపాటు సాగిన సర్వేలో సుమారు 9 వేల మంది శాంపిళ్లను పరీక్షించారు. ఇందులో సుమారు 54 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించామంటున్న సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కే మిశ్రా, ఎన్‌ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ లక్ష్మయ్యతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
Ccmb Director rakesh k mishra and Nin Scientist lakshmaiah Interview
"జనవరిలో శాంపిళ్లను పరీక్షించాం. 30 వార్డుల్లో ఒక్కో వార్డు నుంచి 300 శాంపిళ్లు పరీక్షించాం. లక్షణాలు లేని చాలా మందికి కరోనా వైరస్ వచ్చింది. లక్షణాలు లేని చాలా మందిలో యాంటీ బాడీస్ గుర్తించాం. ప్రభుత్వ సహకారంతో సీరో సర్వేను చేయగలిగాం." -ఎన్‌ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ లక్ష్మయ్య