ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా.. డిశ్ఛార్జి పిటిషన్‌లో కౌంటరుకు సీబీఐ గడువు కోరింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ-గృహ నిర్మాణ మండలికి చెందిన కేసుల్లో ప్రధాన నిందితులైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు డిశ్ఛార్జి పిటిషన్(Jagan discharge petition)లు దాఖలు చేశారు. వీటిపై కౌంటరు దాఖలు చేయడానికి మరికొంత గడువు కావాలని సీబీఐ.. బుధవారం సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
విచారణ వాయిదా
లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో జగన్, విజయసాయిరెడ్డితోపాటు లేపాక్షి ఎండీ శ్రీనివాస బాలాజీ, ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్యలు డిశ్ఛార్జి పిటిషన్(Jagan discharge petition)లు దాఖలు చేశారు. దీనికి అనుమతించిన సీబీఐ కోర్టు(Jagan discharge petition) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. దీంతో పాటు ఇందూ- గృహనిర్మాణ మండలి కేసులోనూ కౌంటరుకు గడువు ఇస్తూ 27కి వాయిదా వేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన రాంకీ కేసును 27కి, ఇండియా సిమెంట్స్ కేసును 28కి వాయిదా వేసింది. ఈడీ తరఫున ఎవరూ హాజరుకాకపోవడంతో జగన్ తదితరుల డిశ్ఛార్జి పిటిషన్లలో కౌంటర్ల నిమిత్తం విచారణను వాయిదా వేసింది.