CBI Inquiry on Viveka Murder Case : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమైంది. సోమవారం రోజున పులివెందులలో ముగ్గురు అనుమానితులను సుదీర్ఘంగా విచారించింది. వారిలో కడప జిల్లాకు చెందిన సాక్షి మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఈ కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ.. ఆయన ఫోన్‌ను సీజ్ చేసి, కాల్‌డేటా ఆధారంగా అనుమానితులను ప్రశ్నించినట్లు సమాచారం. సీబీఐ అదనపు ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలో అధికారుల బృందం పులివెందుల, కడప కేంద్రంగా అనుమానితులను కొన్ని నెలలపాటు విచారించింది.
CBI Inquiry on Viveka Murder Case : వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభం
CBI Inquiry on Viveka Murder Case : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమైంది. సోమవారం రోజున పులివెందులలో ముగ్గురు అనుమానితులను సుదీర్ఘంగా విచారించింది. వారిలో కడప జిల్లాకు చెందిన సాక్షి మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఈ కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ.. ఆయన ఫోన్‌ను సీజ్ చేసి, కాల్‌డేటా ఆధారంగా అనుమానితులను ప్రశ్నించినట్లు సమాచారం.
Viveka Murder Case Updates : వారం రోజుల కిందట మళ్లీ కడప చేరుకుని అనుమానితుల కదలికలపై ఆరా తీసినట్లు తెలిసింది. అందులో భాగంగానే సోమవారం ఉదయం పులివెందులలో ముగ్గుర్ని సీబీఐ ప్రశ్నించింది. వీరిలో ప్రధానంగా నెల్లూరులో సాక్షి జిల్లా విలేకరిగా పనిచేస్తున్న బాలకృష్ణారెడ్డిని విచారణకు పిలిచింది. ఆయన వివేకా హత్య జరిగిన సమయంలో కడప జిల్లా సాక్షి విలేకరిగా పనిచేశారు. ఆ రోజు వివేకా ఇంటి నుంచి నిందితుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి.. సాక్షి విలేకరికి ఫోన్ చేసినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. గతంలోనూ బాలకృష్ణారెడ్డిని సీబీఐ విచారించింది. అలాగే జమ్మలమడుగులో సాక్షి మీడియాలో పనిచేస్తున్న ఇద్దరు విలేకరులకు రెండు రోజుల కిందట సీబీఐ నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. హత్య జరిగిన రోజు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి ఫోన్ నుంచి వారి ఫోన్లకు ఎక్కువసార్లు కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు.
పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. ఆయన వేముల మండలంలోని తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. రెండు రోజుల కిందటే సీబీఐ అధికారులు కర్మాగారానికి వెళ్లి ఆయన స్నేహితులను ఆరా తీసినట్లు సమాచారం. గతంలోనూ ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన రోజు వేకువజామున 4 గంటల సమయంలో ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇంటి నుంచి హడావుడిగా వెళ్లిపోయినట్లు సునీత హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో గతంలో పనిచేసిన డాక్టర్ మధుసూదన్‌రెడ్డిని కూడా సీబీఐ విచారణకు పిలిచింది.