తెలంగాణ

telangana

ETV Bharat / city

ys viveka murder: వివేకా హత్య కేసులో కీలక అడుగు.. రిమాండ్‌ రిపోర్టు సమర్పించిన సీబీఐ - viveka-murder-case updates

ఏపీలో వైఎస్​ వివేకా హత్య కేసులో పలువురిని విచారించిన సీబీఐ అధికారులు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. ఉమాశంకర్‌రెడ్డి అరెస్టు సందర్భంగా కడప జిల్లా పులివెందుల కోర్టులో రిమాండ్‌ రిపోర్టు ఇచ్చారు. ఈ కేసులో సునీల్, ఉమాశంకర్ పాత్రపై ఆధారాలను అందులో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.

ys viveka murder
వివేకా హత్య కేసులో రిమాండ్‌ రిపోర్టు సమర్పించిన సీబీఐ

By

Published : Sep 9, 2021, 11:27 PM IST

వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా కడప జిల్లా పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు రిమాండ్‌ రిపోర్టు సమర్పించారు. ఉమాశంకర్‌రెడ్డి అరెస్టు సందర్భంగా అధికారులు రిమాండ్‌ రిపోర్టు ఇచ్చారు. హత్యకేసులో సునీల్, ఉమాశంకర్ పాత్రపై ఆధారాలను రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచారు. హత్య కేసులో ఇద్దరి కుట్రకోణం ఉందని తెలిపారు. సునీల్​ను విచారిస్తున్న సమయంలో ఉమాశంకర్ పాత్రపై తెలిసిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంలో ఉమాశంకర్ పాత్ర ఉందని సునీల్ తెలిపినట్లు వివరించారు.

వివేకా హత్యకు ముందే సునీల్, ఉమాశంకర్ కలిసి కారుతో ఢీకొట్టి కుక్కను చంపినట్లు సీబీఐ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. హత్య చేయడానికి సునీల్, ఉమాశంకర్ ద్విచక్రవాహనంపై వెళ్లారని, ఉమాశంకర్ బైక్‌లో గొడ్డలి పెట్టుకొని పారిపోయిట్లు వివరించారు. ఈ ఘటనలో బైక్‌, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌ నుంచి ఫోరెన్సిక్ నివేదిక తెప్పించామని వెల్లడించారు. గతనెల 11న ఉమాశంకర్ ఇంట్లో 2 చొక్కాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరికొందరు నిందితులను పట్టుకోవాల్సి ఉందన్న అధికారులు.. ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. ఉమాశంకర్‌రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

ఇదీ చూడండి:Viveka Murder Case: విచారణకు ఎంపీ అవినాష్ తండ్రి హాజరు

ABOUT THE AUTHOR

...view details