తెలంగాణ

telangana

ETV Bharat / city

CBI on Viveka Case : వివేకా హత్య కేసు దర్యాప్తుకు ఆటంకాలు కలిగిస్తున్నారు - CBI on Viveka Case latest news

CBI on Viveka Case investigation : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు పిలిస్తే... దర్యాప్తు అధికారి, సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారని సీబీఐ తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) హరినాథ్‌ హైకోర్టుకు వెల్లడించారు. పులివెందులకు చెందిన వెంకట కృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా యాడికి వాసి గంగాధర్‌రెడ్డిలు... సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై దిగువ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదులు వేశారన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగదన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని వేసిన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.

CBI on Viveka Case
CBI on Viveka Case

By

Published : Sep 13, 2022, 12:03 PM IST

filing private complaint without allowing the CBI officer: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు పిలిస్తే.. దర్యాప్తు అధికారి, సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారని సీబీఐ తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) హరినాథ్‌ హైకోర్టుకు వెల్లడించారు. పులివెందులకు చెందిన వెంకట కృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా యాడికి వాసి గంగాధర్‌రెడ్డిలు.. సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై దిగువ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదులు వేశారన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగదన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని వేసిన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు.

దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను సీబీఐ ఏఎస్పీ బెదిరిస్తున్నారంటూ గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి కడప ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌/ స్పెషల్‌ మొబైల్‌ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్‌ కోర్టు దాన్ని ఠాణాకు రిఫర్‌ చేసింది. రిమ్స్‌ ఠాణా పోలీసులు సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఐపీసీ సెక్షన్‌ 195ఏ, 323, 506, రెడ్‌విత్‌ 34 కింద కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టేయాలని రామ్‌సింగ్‌ హైకోర్టును ఆశ్రయించగా... ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపేస్తూ ఫిబ్రవరిలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సోమవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది.

తీర్పు దస్త్రాల అదృశ్యంపై హైకోర్టు విస్మయం

ఓ కేసుకు సంబంధించి కింది కోర్టు ఇచ్చిన తీర్పు దస్త్రాలు కనిపించకుండా పోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. న్యాయస్థానంలో పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ శాఖల అధికారులను ఎలా ప్రశ్నించగలమని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేసి, బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు నమోదయ్యేలా చూడాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి-పీడీజే)ని ఆదేశించింది. పూర్తి వివరాలను హైకోర్టు ముందు ఉంచాలని పీడీజేను ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 14కు వాయిదా వేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. నరసరావుపేట సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులోని ఓ దావా వ్యవహారంలో 1998 ఏప్రిల్‌ 6న ఇచ్చిన తీర్పు ప్రతిని ధ్రువీకరించి ఇవ్వాలని కోరుతూ చేసిన అభ్యర్థనను... ఆ ఫైలు తమకు అప్పగించలేదనే కారణంతో తిరస్కరిస్తున్నారని పేర్కొంటూ వినుకొండకు చెందిన షేక్‌ లతీఫ్‌సాహెబ్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details