తెలంగాణ

telangana

ETV Bharat / city

viveka murder case: వివేకా హత్యకేసు.. సీబీఐ ఎదుట హాజరైన మీడియా ప్రతినిధులు - viveka murder latest updates

ఏపీలో మాజీమంత్రి వైఎస్​ వివేకానంద రెడ్డి హత్యకేసులో(viveka murder case) మీడియా ప్రతినిధులు(media representatives) సీబీఐ (CBI) విచారణకు హాజరయ్యారు. వివేకా ఇంటి వాచ్​మెన్ రంగన్నను కొందరు మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేయగా.. వారికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. రంగన్నకు చెందిన ఫుటేజీ, డాక్యుమెంట్లు అందించి విచారణకు సహకరించాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది.

viveka murder case
వైఎస్​ వివేకానంద రెడ్డి హత్యకేసులో హాజరైన మీడియా ప్రతినిధులు

By

Published : Sep 21, 2021, 10:16 PM IST

ఏపీలో మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్యకేసులో(viveka murder case) విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు(CBI).. మీడియా ప్రతినిధులకు నోటీసులు పంపారు. జులై 24న వివేకా ఇంటి వాచ్​మెన్ రంగన్న మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత పులివెందులలో (pulivendula) అతన్ని కొందరు మీడియా ఛానల్స్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. సెల్ ఫోన్లో రంగన్న మాటలను రికార్డు చేసిన ఛానల్స్​కు సీబీఐ నోటీసులు(CBI Notices) పంపింది. ఆ రోజు రంగన్నను ఇంటర్వ్యూ చేసిన కడప, పులివెందుల రిపోర్టర్లను ఫుటేజీ తీసుకుని విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కడప కేంద్ర కారాగారం(kadapa central jail) అతిథి గృహంలో సీబీఐ అధికారుల ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ మేరకు మంగళవారం రెండు ఛానల్స్​కు చెందిన మీడియా ప్రతినిధులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. రంగన్నను ఇంటర్వ్యూ చేసిందెవరు అనే దానిపై వారిని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. బుధవారం మరికొందరు మీడియా ప్రతినిధులు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. రంగన్నకు చెందిన ఫుటేజీ, డాక్యుమెంట్లు అందించి విచారణకు సహకరించాలని సీబీఐ పేర్కొంది.

ఇదీ చదవండి:

13 హైకోర్టులకు నూతన సీజేలు- సుప్రీం కొలీజియం సిఫార్సు

ABOUT THE AUTHOR

...view details