తెలంగాణ

telangana

ETV Bharat / city

వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 15వ రోజూ కొనసాగుతోంది. ఇవాళ నలుగురు అనుమానితులను విచారించింది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న మున్నాతో పాటు ముగ్గురు చెప్పుల డీలర్లను ప్రశ్నించింది.

cbi-focus-on-key-evidence-in-ys-viveka-murder-case
వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

By

Published : Sep 27, 2020, 10:58 PM IST

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 15వ రోజూ కొనసాగుతోంది. నలుగురు అనుమానితులను కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ముగ్గురు కడప, ఒకరు పులివెందులకు చెందినవారు ఉన్నారు. వీరంతా చెప్పుల దుకాణం డీలర్లే.

పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను 5 రోజుల పాటు సీబీఐ విచారించింది. అతని ముగ్గురు భార్యలను విచారించారు. 3 నెలల నుంచి పులివెందులలో మున్నా చెప్పుల దుకాణం మూసేశాడు. కానీ ఆతనికి సంబంధించిన బ్యాంక్ లాకర్​లో రూ.48 లక్షలు, 25 తులాల బంగారం గుర్తించారు. ఇంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందనే దానిపై సీబీఐ ప్రశ్నిస్తోంది. మున్నాకు చెప్పులు సరఫరా చేసే డీలర్లను సీబీఐ ఇవాళ విచారణకు పిలిచింది. వీరి వాంగ్మూలం కూడా నమోదు చేసింది.

ఇదీ చదవండి :ప్రేమవివాహం చేసుకున్నాడు.. కుటుంబకలహాలతో శవమయ్యాడు

ABOUT THE AUTHOR

...view details