తెలంగాణ

telangana

ETV Bharat / city

Viveka murder case: 14వ రోజు విచారణ.. 8 మందిని ప్రశ్నిస్తోన్న సీబీఐ - 14th day CBI enquiry on Vivekananda Reddy murder case

ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 14వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు 8 మంది అనుమానితులు హాజరయ్యారు.

viveka murder case enquiry on 14th day
వివేకా హత్య కేసులో 14వ రోజు విచారణ

By

Published : Jun 20, 2021, 2:32 PM IST

ఆంధ్రప్రదేెశ్​ మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో 14వ రోజు విచారణ కొనసాగుతోంది. ఇవాళ సీబీఐ విచారణకు మొత్తం 8 మంది హాజరయ్యారు. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని 4వ రోజు ప్రశ్నిస్తున్నారు. అశోక్ కుమార్, ఓబులపతి, రాఘవేంద్ర అనే ముగ్గురిని అధికారుల బృందం విచారిస్తోంది. పులివెందులకు చెందిన దంపతులు కృష్ణ, సావిత్రితోపాటు శ్రీరాములు, హరినాథ్‌రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు.

సాక్ష్యాల తారుమారు అభియోగాలపై...

వివేకాకు అత్యంత సన్నిహితుడిగా పనిచేసిన ఎర్ర గంగిరెడ్డి.. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన రోజు ఆయన ఇంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై రెండేళ్ల కిందటే సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్​పైన ఉన్న ఎర్ర గంగిరెడ్డిని అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి:CORONA MEDICINES: కేసులు తగ్గుముఖం.. తగ్గిన కరోనా మందుల వినియోగం

ABOUT THE AUTHOR

...view details