అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై ఈ నెల 1న జరిగిన విచారణ సందర్భంగా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని జగన్, రఘురామకృష్ణరాజు, సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు జగన్, రఘురామ లిఖితపూర్వక వాదనలు సమర్పించారు.
JAGAN CASE: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. గత విచారణ సమయంలో.. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలన్న కోర్టు ఆదేశాలతో.. జగన్, రఘురామ లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించబోమని చెప్పింది. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 14కి వాయిదా వేసింది.
JAGAN CASE: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ వాయిదా
లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు సీబీఐకి ఇవాళ మధ్యాహ్నం వరకు గడువునిస్తూ సీబీఐ కోర్టు విచారణ వాయిదా వేయగా.. లిఖితపూర్వక వాదనలు సమర్పించబోమని సీబీఐ తెలిపింది. దీంతో విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:Jagan: పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: జగన్