తెలంగాణ

telangana

ETV Bharat / city

Illegal water connection in Hyderabad : గ్రేటర్​లో అక్రమ నల్లా కనెక్షన్లపై ఉక్కుపాదం - హైదరాబాద్​లో అక్రమ నల్లా కనెక్షన్లు

Illegal water connection in Hyderabad : అక్రమంగా మంచినీటి నల్లా కనెక్షన్ పొందిన పలువురుపై జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తుర్కయంజాల్ సెక్షన్ పరిధిలో నాలుగు అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించడంతో పాటు 44 మందిపై చర్యలు తీసుకున్నారు.

Illegal water connection in Hyderabad
Illegal water connection in Hyderabad

By

Published : Feb 5, 2022, 11:52 AM IST

Illegal water connection in Hyderabad : జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన పలువురు వ్యక్తుల మీద జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తుర్కయంజాల్ సెక్షన్ పరిధిలో నాలుగు అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించడంతో పాటు 44 మందిపై కేసు నమోదు చేశారు.

Illegal water connection Cases in Hyderabad : అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నా.. జలమండలి విజిలెన్స్ బృందానికి లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details