కరోనా ఎఫెక్ట్: జైళ్లలో ములాఖత్‌లు రద్దు - jail
15:55 March 17
కరోనా ఎఫెక్ట్: ములాఖత్‌లు రద్దు
జైళ్లలో ఉన్న ఖైదీలతో ములాఖత్‌లు రద్దు చేస్తూ జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఖైదీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ములాఖత్‌లు రద్దు చేస్తున్నట్లు రాజీవ్ త్రివేదీ తెలిపారు. ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ములాఖత్ కోసం ఎవరూ జైళ్ల వద్దకు రావొద్దని సూచించారు. ఖైదీలతో ఫోన్... ఈ-ములాఖత్ ద్వారా కలుసుకునే అవకాశాన్ని జైలు అధికారులు కల్పించారు.
ఇవీ చూడండి:తెలంగాణలో మరో కరోనా కేసు: మంత్రి ఈటల