తెలంగాణ

telangana

ETV Bharat / city

తస్మాత్ జాగ్రత్త: కరోనా వేళ విరాళం పేరుతో మోసం - donation

సైబర్‌ నేరగాళ్లు కరోనా మహమ్మారి పేరుతోనూ సొమ్ము చేసుకొనే పనిలో పడ్డారు. ప్రధానమంత్రి సహాయనిధి ఖాతాకు నకిలీ తయారుచేసి అమాయకులను బురిడీ కొట్టించేందుకు సైబర్‌ దొంగలు ప్రయత్నిస్తున్నారు. ఎలా మోసగిస్తున్నారంటే...

Care before donating to Corona
Care before donating to Corona

By

Published : Apr 3, 2020, 7:46 PM IST

కరోనా కట్టడి ప్రయత్నంలో దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించే పనిలో పడింది కేంద్రం. అయితే.. దీనినీ కేటుగాళ్లు వదిలి పెట్టడం లేదు. ప్రధానమంత్రి సహాయనిధి ఖాతాకు నకిలీ తయారుచేసి అమాయకులను బురిడీ కొట్టించేందుకు సైబర్‌ దొంగలు ప్రయత్నిస్తున్నారు.

ఒక అక్షరం తేడాతో వారు నకిలీ ఐడీని సృష్టించినట్లు రెండురోజుల క్రితం దిల్లీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కనిపెట్టారు. వెంటనే అప్రమత్తమై నకిలీ ఐడీని బ్లాక్‌ చేశారు. పౌరులు అందించే విరాళాల కోసం కేంద్ర ప్రభుత్వం అధికారిక యూపీఐ ఐడీ గురించి ప్రచారం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే సైబర్‌ నేరగాళ్లు నకిలీని సృష్టించి అంతర్జాలంలో ఉంచినట్లు వెల్లడైంది. ఇలాంటివి అరడజను వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా పొంచి ఉంటారు..

  1. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చే వారి కోసం ఎస్‌బీఐ బ్యాంకు యూపీఐ ఐడీని రూపొందించింది. అధికారిక భీమ్‌ యూపీ ఐడీ pmcares@sbi ప్రస్తుతం అందుబాటులో ఉంది.
  2. సైబర్‌ దొంగలు pmcare@sbi పేరిట నకిలీ యూపీఐ ఐడీని సృష్టించారు. ఇది చూడ్డానికి అసలు ఐడీనే పోలి ఉంది. పరీక్షించి చూస్తే అధికారిక ఐడీలో ఉన్న ‘ఎస్‌’ అక్షరం ఇందులో తీసేశారు.
  3. విరాళాలు ఇచ్చే దాతలు ఆ ‘ఎస్‌’ అక్షరం లేకుండా నమోదు చేసి డబ్బు పంపిస్తే సైబర్‌ దొంగల పరమైపోతుంది.

సందేశాలతోనూ మోసం

ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళాలు పంపాలంటూ సైబర్‌ నేరస్థులు వేల మందికి సందేశాలు పంపిస్తూ మోసగించే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు. ఫోన్లు చేసి మరీ మోసాలు చేస్తారని, జనం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ప్రధానమంత్రి సహాయనిధికి విరాళాలను పంపాలనుకున్నవారు అధికారిక బ్యాంకు ఖాతాలకే పంపాలని సూచిస్తున్నారు.

అధికారిక ఖాతా ఇదే...

ABOUT THE AUTHOR

...view details