తెలంగాణ

telangana

ETV Bharat / city

Bus Ticket Fare Hike: 'సీఎం నిర్ణయం తర్వాతే బస్​ ఛార్జీల పెంపు' - rtc chairmen bajireddy govardhan reddy interview

Bus Ticket Fare Hike: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నిర్ణయం తర్వాత బస్‌ ఛార్జీలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు. సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించడం... కొత్త బస్సుల కొనుగోలు.. తదితర అవసరాల కోసం ఛార్జీల పెంపు తప్పదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంస్థను ప్రైవేటు పరం చేసే ప్రసక్తేలేదని.. డిపోలు మూసేస్తామంటూ.. స్థలాలు అమ్మేస్తారంటూ.. జరుగుతున్న ప్రచారం అసత్యమంటున్న బాజిరెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

Bus Ticket Fare Hike after cm kcr decision said rtc chairmen bajireddy govardhan reddy
Bus Ticket Fare Hike after cm kcr decision said rtc chairmen bajireddy govardhan reddy

By

Published : Dec 1, 2021, 10:45 PM IST

Bus Ticket Fare Hike:"బస్సు ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం 20 పైసలు పెంచినా ఉపయోగం లేదు. కరోనా వల్ల సంస్థపై అదనపు భారం పడింది. నష్టాలు గట్టెక్కించాలి.. బస్సులు కొనుగోలు చేయాలి. దూర ప్రాంతాలకు బస్సులు పెంచే యోచన. ఛార్జీల పెంపుతో 7 వందల కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది. పెంపు నిర్ణయంపై ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత లేదు. నష్టాల నుంచి బయటపడతామనే నమ్మకం లేదు. బీఓటీ పద్దతిలో ఆర్టీసీ ఖాళీ స్థలాలు లీజుకిచ్చే యోచన ఉంది. ఆర్టీసీకి దాదాపు 14 వందల ఎకరాల వరకు ఉంటుంది. స్థలాలు లీజుకు త్వరలోనే టెండర్లు పిలుస్తాం. స్థలాలు అమ్మడం లేదు.. డిపోలు ముూసేయడం లేదు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ఆలోచనే లేదు. ముఖ్యమంత్రి నిర్ణయం తర్వాతే ఛార్జీల పెంచుతాం. త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎంను కోరతాం."

- బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆర్టీసీ ఛైర్మన్‌

సీఎం నిర్ణయం తర్వాతే బస్​ ఛార్జీల పెంపు

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details