హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ఓ హోటల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా... తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. బిడ్డ పుట్టిన గంటలోపు ఇచ్చే తల్లిపాలు దివ్యఔషధంగా పనిచేస్తాయని వైద్యులు తెలిపారు. గతంతో పోలిస్తే ఇటీవల ప్రజల్లో అవగాహన పెరిగిందని... ఇంకా చైత్యన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులతో పాటు భారీ సంఖ్యలో మాతృమూర్తులు పాల్గొన్నారు.
'తల్లిపాలే బిడ్డకు దివ్యఔషధం'
బిడ్డ పుట్టిన గంటలోపు ఇచ్చే తల్లిపాలు దివ్యాఔషధమని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్‌లో అవగాహన కల్పించారు.
'తల్లిపాలే బిడ్డకు దివ్యఔషధం'