'కేసీఆర్ వైఖరి మారకపోతే.. ఆందోళన ఉద్ధృతం చేస్తాం' - ఆర్టీసీ సమ్మెకు బీఎంఎస్ మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం సమంజసం కాదని బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అన్నారు.
ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మారకపోతే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్ హెచ్చరించారు. 15 రోజులు ముందే సమ్మె నోటీసు ఇచ్చినా.. స్పందించకుండా కార్మికులు స్వచ్ఛందంగా వైదొలిగారని ప్రకటించడం భావ్యం కాదని మండిపడ్డారు. కార్మికులకు మద్దతు తెలుపుతూ కార్యాచరణ ప్రకటించింది. ఈనెల 11, 12న రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నానిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.