ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భాజపా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ప్రత్యేక్ష కార్యాచరణకు సిద్ధమవుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. శనివారం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 31 బస్సు డిపోల ఎదుట ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. బస్సు భవన్ ఎదుట జరిగే ధర్నాకు లక్ష్మణ్ నేతృత్వం వహించనున్నారు. ఆర్టీసీ సమ్మె కేవలం 50 వేల కార్మికుల సమస్య మాత్రమే కాదని... తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం భాజపా పూనుకుందన్న లక్ష్మణ్... కేసీఆర్ నియంతపాలనను అంతం చేస్తామని హెచ్చరించారు.
రేపటినుంచి డిపోల ఎదుట భాజపా ఆందోళనలు - ఆర్టీసీ సమ్మెకు భాజపా సంపూర్ణ మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భాజపా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రేపు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 31 బస్సు డిపోల ఎదుట ధర్నా నిర్వహిస్తామని లక్ష్మణ్ వెల్లడించారు.
ఆర్టీసీ సమ్మెకు భాజపా సంపూర్ణ మద్దతు