తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా భాజపా ఎదిగిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. భాజపా ప్రభంజనంతో తెరాస నేతల్లో ఆందోళన మొదలైందని అన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శంషాబాద్‌లోని ఓ హాల్లో ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో తెరాసను ఓడించి... అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా భాజపా: లక్ష్మణ్ - bjp
గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 4 ఎంపీ సీట్లు గెలిచి, 20శాతం ఓట్లు సాధించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో తెరాసకు భాజపాయే ప్రత్యాయ్నాయం అని ఉద్ఘాటించారు.
laxman