రూ.600 కోట్లు సంపాదించినట్లు సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. నిరూపిస్తే నిరుద్యోగ భృతి చెల్లిస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. తనపైన చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరన్నారు. భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బంజారాహిల్స్లో నిర్వహించిన దళిత పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అది నిరూపిస్తే.. నిరుద్యోగ భృతి నేనే చెల్లిస్తా : బండి సంజయ్ - బండి సంజయ్ వార్తలు
సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రూ.600 కోట్లు సంపాదించినట్లు ప్రచారం చేస్తున్నారని... నిరూపిస్తే నిరుద్యోగ భృతిని తానే చెల్లిస్తానని స్పష్టం చేశారు. భాజపా ఎస్సీ మోర్ఛా ఆధ్వర్యంలో బంజారాహిల్స్లో నిర్వహించిన దళిత పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
bandi sanjay
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్కు కనువిప్పు కలగాలంటే భాజపా అభ్యర్థులను గెలిపించాలని బండి సంజయ్ కోరారు. జీతాలే ఇవ్వలేని ముఖ్యమంత్రి ఫిట్మెంట్ ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి :'ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే కేంద్రం ఎజెండా'