తెలంగాణ

telangana

ETV Bharat / city

'విమోచన దినోత్సవం కోసం మంత్రివర్గ సమావేశం పెట్టడం సిగ్గు చేటు' - కేసీఆర్ పై బండి మండిపాటు

Bandi Sanjay on CM Kcr: సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని చెప్పడం భాజపా విజయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అభివర్ణించారు. దారుసలం నుంచి ప్రకటన వచ్చాకే తెరాస, కాంగ్రెస్ విమోచన దినోత్సవంపై నోరు మెదిపాయని బండి మండిపడ్డారు. మజ్లిస్‌ చేతిలో రాష్ట్రప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని దుయ్యబట్టారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : Sep 3, 2022, 8:14 PM IST

'విమోచన దినోత్సవం కోసం మంత్రివర్గ సమావేశం పెట్టడం సిగ్గు చేటు'

Bandi Sanjay on CM Kcr: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ అధికారికంగా జరుపుతామని చెప్పడం భాజపా విజయమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. దారుసలం నుంచి ప్రకటన వచ్చాకే తెరాస, కాంగ్రెస్‌ విమోచన దినోత్సవంపై ప్రకటన చేశాయని మండిపడ్డారు. విమోచన దినోత్సవం కోసం మంత్రివర్గ సమావేశం పెట్టడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. మజ్లిస్‌ చేతిలో రాష్ట్రప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని దుయ్యబట్టారు.

ఒవైసీ అదేశాలు మాత్రమే తెరాస, కాంగ్రెస్‌ పాటిస్తాయని సంజయ్‌ ఆరోపించారు. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఒవైసీ జై తెలంగాణ అనలేదన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ నిర్వహించాలని.. నిర్ణయించిన తర్వాతే అందరూ దీన్ని నిర్వహిస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

'ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాల్సిన అవసరం ఉంది. చరిత్రనే వక్రీకరిస్తున్నారు పేరు మార్చడంలో ఆశ్చర్యం ఏముందీ? ఇన్ని రోజులూ జెండా ఎందుకు ఎత్తలేదు? ఇప్పుడెందుకు ఎత్తుతున్నరు? ఓట్ల సీట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్‌ చేతిలో కీలుబొమ్మగా మారింది. విమోచన దినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినంగా జరుపుతామనటం దారుణం. సెప్టెంబర్‌ 17 విషయంలో ఒక రకంగా భాజపా విజయం సాధించింది. ఇన్నాళ్లు ఏ పేరుతోనూ కేసీఆర్ వేడుకలు నిర్వహించలేదు.'- బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details