గణేశ్ నవరాత్రి ఉత్సవాలపై ప్రభుత్వ ఆంక్షలు, నిర్బంధాలకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ నిరసనలకు భాజపా రాష్ట్ర శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తుందని... అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఉత్సవాలపై నిర్భందంతోనే కేసీఆర్ పాలన పతనం మొదలైందని పేర్కొన్నారు. రంజాన్, బక్రీద్ సమయంలో ఇచ్చిన స్వేచ్ఛ... బోనాలు, వినాయక చవితికి విధించిన ఆంక్షలు ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
వీహెచ్‌పీ నిరసనల్లో పాల్గొని హిందువుల ఐక్యత చాటుదాం: బండి - వీహెచ్‌పీ నిరసనలకు భాజపా మద్దతు
గణేశ్ ఉత్సవాల పట్ల ప్రభుత్వ వైఖరిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ చేపట్టనున్న నిరసనలకు పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.
వీహెచ్‌పీ నిరసనల్లో పాల్గొని హిందువుల ఐక్యత చాటుదాం: బండి
సోమవారం నాడు జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, వినాయక మండపాలు తొలగించిన స్థలాల్లో నల్లజెండాలతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా నిరసన తెలపాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ధర్మ పరిరక్షణ కోసం... వీహెచ్‌పీ నిరసనల్లో పాల్గొని హిందువుల ఐక్యతను చాటుకుందామన్నారు.