తెలంగాణ

telangana

ETV Bharat / city

BJP Protest Live Updates : దేశంలో అత్యంత అవినీతి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి: జేపీ నడ్డా - బండి సంజయ్‌ అరెస్టుకు వ్యతిరేకంగా భాజపా నిరసన

BJP Protest Live Updates
BJP Protest Live Updates

By

Published : Jan 4, 2022, 9:50 AM IST

Updated : Jan 4, 2022, 8:25 PM IST

20:24 January 04

దేశంలో అత్యంత అవినీతి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి

  • తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోంది
  • వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కేసీఆర్‌ పాలన ఉంది
  • తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం వస్తోంది
  • భాజపా తెలంగాణలో ధర్మ యుద్ధం చేస్తోంది
  • ధర్మ యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళ్తాం
  • జాతీయ పార్టీగా కేసీఆర్‌ ముసుగు తొలగిస్తాం
  • రాష్ట్రంలో నియంతృత్వ, నిరంకుశ పాలన సాగుతోంది
  • భాజపా పోరాటం ప్రజాస్వామ్య పద్ధతిలో అంతిమ నిర్ణయం వచ్చే వరకు సాగుతుంది
  • హుజూరాబాద్‌ రుచిని రాష్ట్రమంతా తెరాసకు చూపిస్తాం
  • భాజపా సైద్ధాంతిక పార్టీ.. వ్యక్తుల ఆధారంగా పనిచేయదు
  • బండి సంజయ్‌ను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం
  • బండి సంజయ్‌ అరెస్టుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి నివేదిస్తాం
  • బండి సంజయ్‌ అరెస్టుపై అన్ని వేదికలపై న్యాయపోరాటం చేస్తాం
  • సంజయ్‌ అరెస్టుపై స్పీకర్‌ రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటారు

20:24 January 04

  • శాంతియుతంగా ధర్నా చేయాలని సంజయ్‌ నిర్ణయం: జేపీ నడ్డా
  • భాజపా కార్యాలయంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లారు
  • భాజపా కార్యాలయంలోకి పోలీసులు బలవంతంగా చొచ్చుకెళ్లారు
  • బండి సంజయ్‌పై పోలీసులు చేయిచేసుకున్నారు
  • భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు
  • దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓటమి జీర్ణించుకోలేకపోతున్నారు
  • ఓటమిని జీర్ణించుకోలేక నియంతృత్వ పోకడలకు వెళ్తున్నారు
  • ధర్నాచౌక్‌ వద్ద ధర్నాలు చేయవద్దని చెప్పారు
  • ధర్నాలు వద్దన్న తెరాస నేతలే ధర్నాచౌక్‌లో నిరసన తెలిపారు
  • కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ ఏటీఎం మాదిరి వాడుకున్నారు
  • పాలమూరు, రంగారెడ్డి ఒక్క నీటిచుక్క ఇవ్వలేదు

20:07 January 04

  • భాజపా కార్యాలయంలో జేపీ నడ్డా మీడియా సమావేశం
  • ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చా: జేపీ నడ్డా
  • విమానాశ్రయంలోనే నన్ను పోలీసులు కలిశారు: జేపీ నడ్డా
  • రాష్ట్రంలో కొవిడ్‌ నిబంధనలు ఉన్నాయని చెప్పారు: జేపీ నడ్డా
  • కరోనా నిబంధనలు పాటిస్తానని పోలీసులకు చెప్పా: జేపీ నడ్డా
  • రెండ్రోజులుగా జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య హత్యే: జేపీ నడ్డా
  • రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోంది: జేపీ నడ్డా
  • అవినీతి ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తాం: జేపీ నడ్డా
  • జీవో 317 ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉంది: జేపీ నడ్డా
  • ఉద్యోగులు, ప్రజల తరఫున పోరాడాల్సిన బాధ్యత మాపై ఉంది: నడ్డా
  • ప్రజలు, ఉద్యోగుల పక్షాన పోరాడాలని నిర్ణయించాం: జేపీ నడ్డా
  • శాంతియుత పద్ధతుల్లో ప్రజల తరఫున పోరాటం: జేపీ నడ్డా

19:48 January 04

  • భాజపా కార్యాలయానికి చేరుకున్న జేపీ నడ్డా
  • సికింద్రాబాద్‌ నుంచి నాంపల్లి భాజపా కార్యాలయానికి జేపీ నడ్డా
  • కాసేపట్లో భాజపా కార్యాలయంలో జేపీ నడ్డా మీడియా సమావేశం

19:02 January 04

భాజపా కార్యాలయానికి బయలుదేరిన జేపీ నడ్డా

  • సికింద్రాబాద్‌ నుంచి నాంపల్లి భాజపా కార్యాలయానికి జేపీ నడ్డా
  • కాసేపట్లో భాజపా కార్యాలయంలో జేపీ నడ్డా మీడియా సమావేశం

19:02 January 04

సత్యాగ్రహం పూర్తయినట్లు ప్రకటించిన కిషన్‌రెడ్డి

  • ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం సాగిద్దాం: లక్ష్మణ్‌
  • కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అందరూ ఇక్కడి నుంచి వెళ్లాలి: లక్ష్మణ్‌
  • 14 రోజులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం: లక్ష్మణ్‌
  • నిరంకుశ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం: లక్ష్మణ్‌సత్యాగ్రహం పూర్తయినట్లు ప్రకటించిన కిషన్‌రెడ్డి
  • ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం సాగిద్దాం: లక్ష్మణ్‌
  • కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అందరూ ఇక్కడి నుంచి వెళ్లాలి: లక్ష్మణ్‌
  • 14 రోజులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం: లక్ష్మణ్‌
  • నిరంకుశ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం: లక్ష్మణ్‌

18:51 January 04

  • సికింద్రాబాద్‌: గాంధీ విగ్రహానికి భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులు
  • జేపీ నడ్డా వెంట కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు
  • నిరసనగా నల్ల మాస్కులు ధరించిన నడ్డా, భాజపా నేతలు
  • బండి సంజయ్‌ అరెస్టుకు వ్యతిరేకంగా నల్ల మాస్కులతో నిరసన
  • కాసేపట్లో భాజపా కార్యాలయంలో జేపీ నడ్డా మీడియా సమావేశం

18:47 January 04

  • సికింద్రాబాద్‌ చేరుకున్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా
  • శంషాబాద్‌ నుంచి సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న నడ్డా
  • జేపీ నడ్డా వెంట కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు

18:06 January 04

  • శంషాబాద్‌లో జేపీ నడ్డాకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
  • నన్ను జాయింట్ సీపీ కార్తికేయ కలిశారు: జేపీ నడ్డా
  • కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పారు: జేపీ నడ్డా
  • నేను అన్ని కరోనా నిబంధనలు పాటిస్తానని చెబుతున్నా: జేపీ నడ్డా
  • నేను నిబంధనలు అతిక్రమిస్తే నోటీసులు ఇవ్వొచ్చు: జేపీ నడ్డా
  • సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పిస్తా: జేపీ నడ్డా
  • నా ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరు: జేపీ నడ్డా
  • శాంతియుతంగా ర్యాలీ జరిగి తీరుతుంది: జేపీ నడ్డా
  • బాధ్యత గల పౌరుడిగా నిబంధనలు పాటిస్తా: జేపీ నడ్డా

18:05 January 04

  • భాజపా ర్యాలీకి అనుమతి లేదు: హైదరాబాద్ సీపీ ఆనంద్
  • భాజపా ర్యాలీకి మేము అనుమతి ఇవ్వలేదు: సీపీ ఆనంద్‌
  • ర్యాలీకి అనుమతించామన్న వార్తలు అవాస్తవం: సీపీ ఆనంద్‌

18:01 January 04

  • సికింద్రాబాద్‌కు భారీగా చేరుకున్న భాజపా శ్రేణులు
  • గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న భాజపా కార్యకర్తలు
  • చేతిలో నల్ల జెండాలు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన
  • ప్యారడైజ్ కూడలి నుంచి ఎంజీ రోడ్డు వరకు పోలీసుల మోహరింపు

18:00 January 04

శంషాబాద్‌ విమానాశ్రయంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా

  • శంషాబాద్‌ నుంచి సికింద్రాబాద్ బయలుదేరిన జేపీ నడ్డా
  • జేపీ నడ్డా వెంట కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్
  • జేపీ నడ్డా వెంట ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు
  • సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పిస్తా: జేపీ నడ్డా
  • ర్యాలీకి అనుమతి లేదని సీపీ కార్తీక్‌ చెప్పారు: జేపీ నడ్డా
  • కరోనా నిబంధనలు ఉన్నాయని పోలీసులు చెప్పారు: జేపీ నడ్డా
  • నేను అన్ని కరోనా నిబంధనలు పాటిస్తానని చెబుతున్నా: జేపీ నడ్డా
  • నేను నిబంధనలు అతిక్రమిస్తే నోటీసులు ఇవ్వొచ్చు: జేపీ నడ్డా
  • నా ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరు: జేపీ నడ్డా

17:40 January 04

శంషాబాద్‌ విమానాశ్రయంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా

  • పరిస్థితిని జేపీ నడ్డాకు వివరించిన పోలీసులు
  • విమానాశ్రయానికి భారీగా చేరుకున్న భాజపా శ్రేణులు
  • భాజపా ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు
  • ర్యాలీ నిర్వహించి తీరుతామంటున్న కమలనాథులు
  • శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన జేపీ నడ్డా

17:34 January 04

  • సికింద్రాబాద్‌: గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటున్న భాజపా శ్రేణులు
  • ప్యారడైజ్ కూడలి నుంచి ఎంజీ రోడ్డు వరకు పోలీసుల మోహరింపు

17:27 January 04

శంషాబాద్ విమానాశ్రయంలో భాజపా నేతలతో జేపీ నడ్డా భేటీ

శంషాబాద్ విమానాశ్రయంలో భాజపా నేతలతో జేపీ నడ్డా భేటీ

  • భేటీలో పాల్గొన్న తరుణ్ చుగ్, లక్ష్మణ్, జితేందర్ రెడ్డి, విజయ శాంతి
  • భేటీలో పాల్గొన్న డీకే అరుణ, రామచంద్రరావు, కాసం వెంకటేశ్వర్లు

17:00 January 04

శంషాబాద్ చేరుకున్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా

  • జేపీ నడ్డాకు విమానాశ్రయంలో భాజపా శ్రేణుల ఘన స్వాగతం
  • జేపీ నడ్డా రాకతో శంషాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం
  • ఉత్కంఠరేపుతున్న భాజపా కొవ్వొత్తుల ర్యాలీ
  • బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
  • భాజపా ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు
  • ర్యాలీ నిర్వహించి తీరుతామంటున్న కమలనాథులు
  • జేపీ నడ్డాకు విమానాశ్రయంలోనే నోటీసులు ఇచ్చే అవకాశం
  • ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వివరించే అవకాశం
  • ర్యాలీకి వెళ్లొద్దని నడ్డాను కోరనున్న పోలీసులు

16:48 January 04

కాసేపట్లో శంషాబాద్ చేరుకోనున్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా

  • నడ్డాకు స్వాగతం పలికేందుకు శంషాబాద్‌ చేరుకున్న భాజపా శ్రేణులు
  • విమానాశ్రయం చేరుకున్న లక్ష్మణ్, రాజాసింగ్, విజయశాంతి
  • జేపీ నడ్డాకు విమానాశ్రయంలోనే నోటీసులు ఇచ్చే అవకాశం
  • ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వివరించే అవకాశం
  • ర్యాలీకి వెళ్లొద్దని నడ్డాను కోరనున్న పోలీసులు

16:39 January 04

భాజపా ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా ప్రకటించిన పోలీసులు

  • ర్యాలీలో పాల్గొననున్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా
  • ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామన్న భాజపా శ్రేణులు
  • సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ తీస్తామన్న భాజపా
  • ర్యాలీలో ఎంతమంది పాల్గొంటారో తెలపలేదన్న పోలీసులు
  • ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం భారీ ర్యాలీకి యత్నిస్తున్నారన్న పోలీసులు
  • ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి ఇవ్వలేమన్న పోలీసులు
  • ఈనెల 10 వరకు ర్యాలీలు, సభలకు అనుమతి లేదన్న పోలీసులు
  • సాయంత్రం ర్యాలీ తీస్తే ట్రాఫిక్ ఇక్కట్లు కలుగుతాయన్న పోలీసులు
  • సికింద్రాబాద్‌లో పలు ఆస్పత్రులు ఉన్నాయన్న పోలీసులు
  • రోగులు, అంబులెన్స్‌లకు ఇబ్బందులు కలుగుతాయన్న పోలీసులు
  • ర్యాలీ వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చన్న పోలీసులు

15:02 January 04

హైకోర్టులో బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్‌

  • తన రిమాండ్‌ను రద్దు చేయాలని హైకోర్టును కోరిన బండి సంజయ్‌
  • అత్యవసర విచారణ చేపట్టాలన్న బండి సంజయ్ అభ్యర్థన అంగీకరించిన హైకోర్టు
  • తనను విడుదల చేసేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరిన సంజయ్‌
  • తనపై ఉన్న ఐపీసీ 333 సెక్షన్‌ను కొట్టివేయాలని కోరిన సంజయ్‌
  • బండి సంజయ్ పిటిషన్‌పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరిగే అవకాశం

13:27 January 04

  • భాజపా నేతలను కేసీఆర్‌ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోంది
  • కొవిడ్‌ నిబంధనల సాకుతో తప్పుడు కేసులు పెట్టారు
  • కొవిడ్‌ నిబంధనలు భాజపా భవనానికి మాత్రమే వర్తిస్తాయా?
  • ఏ ప్రాతిపదికన భాజపా కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు?
  • అక్రమ కేసులకు భాజపా ప్రభుత్వం భయపడదు
  • ధర్నాచౌక్‌లో సీఎం ఆందోళన చేయవచ్చు.. ప్రతిపక్షాలు చేయకూడదా?
  • తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇంత అణిచివేత లేదు
  • ఇలాంటి రాచరిక, నియంతృత్వ పాలన కోసమే ఉద్యమం చేశామా?
  • దిల్లీలో ఏడాదిపాటు రైతులు ఉద్యమం చేసినా కేంద్రం అడ్డుకోలేదు
  • కేసీఆర్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తాం

12:53 January 04

తెరాస ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు పెడుతోంది: ఎంపీ అర్వింద్‌

  • కేసులకు భయపడే సమస్యే లేదు: నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌
  • ప్రజాసమస్యలపై పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ఎంపీ అర్వింద్‌
  • ఎన్ని వందల కేసులు పెట్టినా తెలంగాణ ప్రజల కోసం భాజపా పోరాటం చేస్తూనే ఉంటుంది: ఎంపీ అర్వింద్

12:46 January 04

కరీంనగర్: బండి సంజయ్‌ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న కిషన్‌రెడ్డి

  • ఈటల, వివేక్‌తో కలిసి కార్యాలయాన్ని పరిశీలిస్తున్న కిషన్‌రెడ్డి
  • కార్యాలయంలో ధ్వంసమైన డోర్లు, ఫర్నిచర్‌ పరిశీలిస్తున్న నేతలు
  • జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన గొడవలో ధ్వంసమైన సామగ్రి

12:02 January 04

మెదక్‌: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అడ్డగింత

  • తుప్రాన్ టోల్‌గేట్‌ వద్ద రఘునందన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కరీంనగర్‌ వెళ్తున్నారని రఘునందన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

11:46 January 04

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరణ

  • భాజపా కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు
  • కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి తీరతామన్న కమలనాథులు
  • శంషాబాద్ విమానాశ్రయం వద్ద నడ్డాను పోలీసులు అడ్డుకునే అవకాశం

11:43 January 04

కరీంనగర్‌: జైల్లో బండి సంజయ్‌కు కిషన్‌రెడ్డి, ఈటల పరామర్శ

  • సంజయ్‌ని కలిసేందుకు కిషన్‌రెడ్డి, ఈటల, వివేక్‌కు అనుమతి
  • ములాఖత్‌లో సంజయ్‌తో మాట్లాడిన కిషన్‌రెడ్డి, ఈటల, వివేక్
  • కాసేపట్లో బండి సంజయ్‌ కార్యాలయాన్ని పరిశీలించనున్న కిషన్‌రెడ్డి

11:39 January 04

కరీంనగర్ జిల్లా జైలుకు చేరుకున్న కిషన్‌రెడ్డి, ఈటల

కరీంనగర్ జిల్లా జైలుకు చేరుకున్న కిషన్‌రెడ్డి, ఈటల

  • సంజయ్‌ని కలిసేందుకు కిషన్‌రెడ్డి, ఈటల, వివేక్‌కు మాత్రమే
  • కాసేపట్లో బండి సంజయ్‌ను పరామర్శించనున్న కిషన్‌రెడ్డి, ఈటల
  • బండి సంజయ్‌ కార్యాలయాన్ని పరిశీలించనున్న కిషన్‌రెడ్డి

10:46 January 04

హైదరాబాద్‌ : భాజపా రాష్ట్ర కార్యాలయంలో మౌన దీక్ష

  • బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా నల్లబ్యాడ్జీలతో మౌన దీక్ష
  • మౌన దీక్షలో పాల్గొన్న భాజపా నేతలు లక్ష్మణ్‌, రాజాసింగ్‌
  • మౌన దీక్షలో పాల్గొన్న విజయశాంతి, ప్రేమేందర్ రెడ్డి
  • మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్న మౌన దీక్ష

09:52 January 04

హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ బయలుదేరిన కిషన్‌రెడ్డి

  • ఎమ్మెల్యే ఈటలతో కలిసి కరీంనగర్‌ బయలుదేరిన కిషన్‌రెడ్డి
  • కరీంనగర్ జైల్లో బండి‌ సంజయ్‌ని పరామర్శించనున్న కిషన్‌రెడ్డి
  • బండి సంజయ్ కార్యాలయాన్ని సందర్శించనున్న కిషన్‌రెడ్డి, ఈటల
  • పోలీసుల లాఠీఛార్జీలో గాయపడ్డవారిని పరామర్శించనున్న కిషన్‌రెడ్డి

09:50 January 04

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉత్తరప్రదేశ్‌ పర్యటన రద్దు

  • జేపీ నడ్డా ఆదేశంతో యూపీ పర్యటన రద్దు చేసుకున్న కిషన్‌రెడ్డి
  • జేపీ నడ్డా ఆదేశంతో హైదరాబాద్‌ చేరుకున్న కిషన్‌రెడ్డి
  • కరీంనగర్‌కు బయలుదేరిన కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్
  • కాసేపట్లో బండి సంజయ్‌ను పరామర్శించనున్న కిషన్‌రెడ్డి
  • కరీంనగర్ జైల్లో బండి‌ సంజయ్‌ని పరామర్శించనున్న కిషన్‌రెడ్డి
  • బండి సంజయ్ కార్యాలయాన్ని సందర్శించనున్న కిషన్‌రెడ్డి
  • బండి సంజయ్‌ పట్ల పోలీసుల తీరును తెలుసుకోనున్న కిషన్‌రెడ్డి
  • బండి సంజయ్‌ కుటుంబసభ్యులను పరామర్శించనున్న కిషన్‌రెడ్డి
  • జైలుకు వెళ్లిన వారి కుటుంబసభ్యులను పరామర్శించనున్న కిషన్‌రెడ్డి

09:39 January 04

రాష్ట్రవ్యాప్తంగా భాజపా నిరసన

  • బండి సంజయ్‌ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలకు భాజపా పిలుపు
  • రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని శ్రేణులకు భాజపా నిర్దేశం
  • రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు నిరసన ప్రదర్శనలకు భాజపా నిర్ణయం
  • నేడు జిల్లా, మండల కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన
Last Updated : Jan 4, 2022, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details