తెలంగాణ

telangana

ETV Bharat / city

చేసిన పనులపై బహిరంగచర్చకు సిద్ధం: రాంచందర్​రావు - తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వార్తలు

ఎమ్మెల్సీగా ఉండి ఏం చేశారంటూ మంత్రి కేటీఆర్​ ప్రశ్నించడం భావ్యం కాదన్నారు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం భాజపా అభ్యర్థి రాంచందర్​రావు. గత ఆరేళ్లుగా శాసనమండలిలో ప్రతిపక్ష పాత్ర పోషించినట్లు చెప్పారు.

ramchander rao
గత ఆరేళ్లుగా మండలిలో ప్రతిపక్ష పాత్ర పోషించా: రాంచందర్​రావు

By

Published : Feb 24, 2021, 9:18 PM IST

ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఎన్నో సార్లు గళం విప్పానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్​రావు తెలిపారు. శాసనమండలిలో ఆరేళ్లు ప్రతిపక్ష పాత్ర పోషించినట్లు వెల్లడించారు. న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని పోరాడినట్లు గుర్తుచేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెచ్చినట్లు చెప్పారు. ప్రశ్నించే గొంతు శాసన మండలిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఎంఎంటీఎస్ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని రాంచందర్​రావు ఆరోపించారు. పీపీఈ కిట్లు, మాస్క్​లు ఇచ్చింది కేంద్రమేనన్నారు. భాజపా అభ్యర్థిని ఓడించేందుకే.. పీవీ కుమార్తెను తెరపైకి తీసుకొచ్చారన్నారు. పీవీ కుటుంబంపై ముఖ్యమంత్రికి అభిమానం ఉంటే రాజ్యసభకు పంపొచ్చుకదా అని ప్రశ్నించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ స్థానంలో కేసీఆర్, కేటీఆర్ పోటీ చేసిన గెలవరని రాంచందర్​రావు అన్నారు. తాను ఏం చేశానో చెప్పడానికి ఓయూ అర్ట్స్ కళాశాల వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

గత ఆరేళ్లుగా మండలిలో ప్రతిపక్ష పాత్ర పోషించా: రాంచందర్​రావు

ఇవీచూడండి:గెలుపు బాధ్యత తెరాస ఎమ్మెల్యేలదే: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details