తెలంగాణ

telangana

ETV Bharat / city

Bjp Mla Raghu Nandan Rao : వైద్యశాఖలోని ఆ మూడు కీలక పోస్టుల్లో అనర్హులకే బాధ్యతలెందుకు?

రాష్ట్ర వైద్యశాఖలోని కీలక పోస్టుల నియామకాలపై శాసనసభ సమావేశాల్లో(Telangana Assembly Sessions 2021) భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు(Bjp Mla Raghu Nandan Rao) ప్రశ్నలు లేవనెత్తారు. ఆ శాఖలోని మూడు కీలక పోస్టులను సీనియారిటీ ప్రకారం భర్తీ చేయకుండా తాత్కాలిక, ఇంఛార్జ్​ల పేరిట అర్హత లేని జూనియర్లను నియమించారని అన్నారు. దీనివల్ల సీనియారిటీ ఉన్న ఎస్సీ, ఎస్టీ అధికారులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులకు అవకాశమివ్వాలని కోరారు.

By

Published : Sep 27, 2021, 12:45 PM IST

Bjp Mla Raghu Nandan Rao
Bjp Mla Raghu Nandan Rao

భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు(Telangana Assembly Sessions 2021) రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు(Bjp Mla Raghu Nandan Rao) ఈ సభలో వైద్యశాఖలోని కీలక పోస్టుల గురించి పలు విషయాలను సభ దృష్టికి తీసుకువెళ్లారు. వైద్యశాఖలోని మూడు కీలక పోస్టులు.. రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు, వైద్యవిద్య సంచాలకులు, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ నియామకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర జీవో 154 ప్రకారం సీనియారిటీ ఉన్న వైద్యులు లేదా ప్రొఫెసర్​లను నియమించాలని రఘునందన్ రావు(Bjp Mla Raghu Nandan Rao) అన్నారు.

కానీ.. తెలంగాణలో ఈ మూడు బాధ్యతలను తాత్కాలిక, ఇంఛార్జ్​ల పేరిట సీనియారిటీ లేని అధికారులకు కట్టబెట్టారని రఘునందన్ (Bjp Mla Raghu Nandan Rao) తెలిపారు. దీనివల్ల సీనియారిటీ ఉన్న ఎస్సీ, ఎస్టీ అధికారులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వారు పలుమార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా.. సర్కార్ స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా దీనిపై స్పందించి అనుభవం ఉన్న అర్హులకు ఈ పదవులు ఇవ్వాలని ఎమ్మెల్యే రఘునందన్(Bjp Mla Raghu Nandan Rao) కోరారు.

"వైద్యశాఖ సంచాలకుని పోస్టుకు సీనియారిటీ ప్రకారం చూస్తే 1 నుంచి 12వ స్థానం వరకు మొత్తం ఎస్సీ, ఎస్టీ అధికారులే ఉన్నారు. కానీ 150వ స్థానంలో ఉన్న అధికారికి ప్రజారోగ్య సంచాలకునిగా బాధ్యతలు ఇచ్చారు. ఈ విషయాన్ని వారు ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్​హెచ్​ఆర్​ఎంకి సంబంధించి ఆ వ్యక్తిపై రూ.20 కోట్ల కుంభకోణం చేశారనే ఆరోపణలున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ శాఖ నివేదిక కూడా ఇచ్చింది. అయినా.. సర్కార్ ఆ వ్యక్తినే ఏడేళ్లుగా ఆ పదవిలో కొనసాగిస్తోంది. ఈ విషయంపై ఎస్సీ, ఎస్టీ సీనియర్ అధికారులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు దీనిపై నివేదిక ఇవ్వాలని డీపీసీ(డిపార్ట్​మెంటల్ ప్రమోషన్ కమిటీ)ని ఆదేశించింది. డీపీసీ తన నివేదికలో మొదటి ఐదు స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ అధికారులే ఉన్నట్లు తెలిపింది. అయినా ఆ కీలక పోస్టుల్లో ఇంకా తాత్కాలిక, ఇంఛార్జులనే కొనసాగిస్తున్నారు."

- రఘునందన్ రావు, భాజపా ఎమ్మెల్యే

ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంపై స్పందించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు(Bjp Mla Raghu Nandan Rao) కోరారు. సీనియారిటీ ఉన్న అర్హులను ఆ పోస్టుల్లో నియమించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details