రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ నియోజవర్గంలోని హయత్‌నగర్, మన్సూరాబాద్ డివిజన్లలో 450 మంది పారిశుద్ధ కార్మికులకు భాజపా నాయకులు అల్పాహారాన్ని అందించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తమ వంతు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు హయత్ నగర్ డివిజన్ భాజపా అధ్యక్షుడు ఉగాది ఎల్లప్ప, మన్సురాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షులు కడారి యాదిగిరి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందజేత - కరోనా వైరస్ వ్యాప్తి
హయత్ నగర్ డివిజన్ భాజపా అధ్యక్షుడు ఉగాది ఎల్లప్ప ఆధ్వర్యంలో హయత్‌నగర్, మన్సూరాబాద్ డివిజన్లలో పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారాన్ని అందజేశారు. కాలనీల పరిశుభ్రత కోసం నిరంతరం పనిచేస్తున్న 450 మంది కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందజేత
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం తప్పక పాటించాలని కోరారు. కార్యక్రమంలో భాజపా నేతలు కళ్లెం రవీందర్ రెడ్డి, వంగేటి ప్రవీణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.