2012లో మహబూబ్నగర్లో నిర్వహించిన తెరాస బహిరంగ సభకు అనుమతి లేదని నాలుగు రోజుల క్రితం కోర్టు నోటీసులు ఇచ్చారని భాజపా నేత విజయశాంతి తెలిపారు. ఆ సభను నిర్వహించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. కేసు పెడితే అతనిపై పెట్టాలని అన్నారు. 2012లో జరిగిన సంఘటనకు తొమ్మిదేళ్ల తర్వాత కేసు పెట్టించడంలోనే కేసీఆర్ భయం అర్థమవుతోందని పేర్కొన్నారు.
'9 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు ఇప్పుడు కేసు పెట్టడమేంటి?'
సీఎం కేసీఆర్.. తనపై అక్రమ కేసులు పెట్టి భయాందోళనకు గురిచేయాలని చూస్తున్నారని భాజపా నేత విజయశాంతి ఆరోపించారు. 2012లో జరిగిన సంఘటనకు.. తొమ్మిదేళ్ల తర్వాత కేసు పెట్టించడంలోనే కేసీఆర్ భయం అర్థమవుతోందని అన్నారు.
విజయశాంతి, నాంపల్లి కోర్టు
ఈ కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరైన విజయశాంతి.. సీఎం కేసీఆర్ తనపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థ పట్ల తనకు నమ్మకం ఉందని.. ఆ దిశగా పోరాడతానని చెప్పారు. ఉద్యమకారులను హింసించడం సరికాదని అన్నారు.