BJP leader Somu Veerraju: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో పార్టీ పెట్టే అర్హతే లేదని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు విమర్శించారు. కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ... త్వరలోనే వీఆర్ఎస్ తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల కోసం పార్టీ పెడుతున్నామని చెప్పి, ఆంధ్రులను పాలేర్లుగా చిత్రీకరించిన కేసీఆర్‌కు ఏపీలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదన్నారు. కుమార్తె కవిత దిల్లీలో మద్యం అమ్ముతూ పట్టుబడితే కేసీఆర్, కేటీఆర్‌లకు మతిభ్రమించి ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేతలపై విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు.
"కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టారు. కేసీఆర్‌కు కొత్త పార్టీ పెట్టే హక్కు లేదు. ఆంధ్రులను ద్రోహులుగా వర్ణించిన కేసీఆర్‌కు ఏపీకి వచ్చే అర్హత లేదు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేతపై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు. కేసీఆర్ కుమార్తె కవిత దిల్లీ మద్యం కుంభకోణంలో చిక్కుకుంది. తెలంగాణలో తెరాస ఓటమి ఖాయం. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్.. వీఆర్‌ఎస్ తీసుకోవాల్సి ఉంటుంది. అమరావతిలోనే ఏపీ రాజధాని ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మమకారం లేదు. రాజధానిని ఎన్నికల అంశంగా ప్రభుత్వం మారుస్తోంది." -భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు