తెలంగాణ

telangana

ETV Bharat / city

'భారత్​లో కూడా చైనా తరహా మిలిటరీ రూల్ కోరుకుంటున్నారా?' - దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు

Raghunandhan Rao Comments: మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యలను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు తప్పుబట్టారు. పదేపదే చైనా గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో కూడా చైనా తరహా పాలన కోరుకుంటున్నారా అని నిలదీశారు.

Bjp leader raghunadhan rao questioned Minister KTR
Bjp leader raghunadhan rao questioned Minister KTR

By

Published : Jun 1, 2022, 8:41 PM IST

Raghunandhan Rao Comments: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విరుచుకుపడ్డారు. చైనా జీడీపీ పెరిగి భారత్‌ది పడిపోయిందని కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చైనాలో మిలిటరీ రూల్‌ ఉన్నదనే విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు. చైనా మిలిటరీ ప్రభుత్వం వేల మంది ముస్లీంను ఊచకోత కోస్తోందని ఆరోపించారు. చైనా తరహా పాలన కావాలని అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. కేంద్రాన్ని విమర్శించేందుకే తెరాస నేతలు ప్రెస్‌మీట్లు పెడుతున్నారని ఆక్షేపించారు. రైతులకు ఉచితంగా ఇస్తామన్న ఎరువులు ఎక్కడికి పోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగబోతున్నాయని.. రెండు రోజుల్లో సమావేశాల వేదిక ఇతర వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.

"చైనా గురించి పదే పదే కేటీఆర్​ ఎందుకు మాట్లాడుతున్నారు. భారత్​లో కూడా చైనా తరహా మిలిటరీ రూల్ కోరుకుంటున్నారా..? చైనా జీడీపీ పెరిగింది... భారత్ ది పడిపోయిందంటూ కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మన దేశంలో కూడా మిలిటరీ రూల్ అమలు చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ కూడా చైనాను మించి పోతుంది. చైనా తరహా పాలన కావాలని అసెంబ్లీలో చర్చ పెట్టండి. చైనాలాగే జీవితకాలం కేసీఆర్ కుటుంబమే అధికారంలోకి ఉండాలని కోరుకుంటుంది. కుటుంబ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేసేందుకే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం."- రఘునందన్​రావు, దుబ్బాక ఎమ్మెల్యే

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details