గ్రేటర్ ఎన్నికలపై భాజపా కీలక భేటీ.. హాజరైన కిషన్‌రెడ్డి - తెలంగాణ రాజకీయ వార్తలు
16:13 November 15
గ్రేటర్ ఎన్నికలపై భాజపా కీలక భేటీ.. హాజరైన కిషన్‌రెడ్డి
దుబ్బాక ఉపఎన్నికల విజయంతో జోరు మీద ఉన్న భాజపా.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ సత్తాచాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది.
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అధ్యక్షతన.. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై నేతలు చర్చిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ అరవింద్, మురళీధర్‌రావు, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.