తెలంగాణ

telangana

ETV Bharat / city

పుట్టిన రోజంటే ఇలా జరుపుకోవాలి అన్నట్లుగా... - birth celebrations

వేగేశ్న ఫౌండేషన్​లోని విద్యార్థులకు అన్నదానం చేశాడు ఇబ్రహీంపట్నానికి చెందిన వెంకటేష్​.. తన పుట్టినరోజున వారితో గడపడం ఆనందంగా ఉందని తెలిపాడు.

పుట్టిన రోజంటే ఇలా జరుపుకోవాలి అన్నట్లు..

By

Published : Aug 16, 2019, 8:04 PM IST

Updated : Aug 16, 2019, 8:11 PM IST

పుట్టిన రోజంటే కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతాం.. లేదంటే స్నేహితులతో షికార్లు చేస్తాం.. కానీ ఆందుకు భిన్నంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నానికి చెందిన నూతనగంటి వెంకటేష్​.. వేగేశ్న ఫౌండేషన్​లోని సుమారు 250 మంది దివ్యాంగ విద్యార్థులకు అన్నదానం చేశాడు. తనకు అతి ప్రియమైన కబడ్డీ ఆటలో వచ్చిన డబ్బునే అన్నదానానికి వినియోగించాడు.

పుట్టిన రోజంటే ఇలా జరుపుకోవాలి అన్నట్లుగా...

సామాజిక కార్యక్రమాలతో పాటు క్రీడల్లోనూ ప్రవేశం ఉన్న వెంకటేష్​ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించాడు. పుట్టిన రోజంటే వేలకు వేలు దుబారాచేసే ప్రస్తుత రోజుల్లో వెంకటేశ్​ ప్రయత్నం అందరికీ ఆదర్శనీయం అని స్థానికులు కొనియాడారు.

పుట్టిన రోజంటే ఇలా జరుపుకోవాలి అన్నట్లు..

ఇవీ చూడండి:'అయోధ్యలో స్తంభాలపై హిందూ దేవతలున్నారు'

Last Updated : Aug 16, 2019, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details