తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇక నుంచి విద్యార్థులకు కూడా..

గవర్నమెంట్​ డిగ్రీ కళాశాల.. ఈ మాట వింటే తరగతులు పెద్దగా జరగవని, క్లాసులకు వెళ్లకపోయిన పర్వాలేదని చాలా మంది భావన. ఈ కారణంగానే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని గవర్నమెంట్​ కళాశాలల్లో చేర్పించడానికి ముందుకువచ్చేవారు కాదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకూ బయోమెట్రిక్​ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది.

bio metric
ఇక నుంచి విద్యార్థులకు కూడా..

By

Published : Feb 29, 2020, 1:00 PM IST

ఇక నుంచి విద్యార్థులకు కూడా..

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల హాజరు నమోదుకు రెండో సెమిస్టర్ నుంచి బయోమెట్రిక్ విధానాన్ని ఉన్నత విద్యాశాఖ అమల్లోకి తెచ్చింది. ఫలితంగా క్రమం తప్పకుండా విద్యార్థులు కళాశాలలకు రావాల్సి ఉంటుంది. దీని ద్వారా హాజరు పెరగడమే కాకుండా ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుందని అధ్యాపకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆ పరిస్థితులు మారాయి

కళాశాలకు వెళ్లకపోయినా పరీక్షలు రాయవచ్చనే భావన ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థుల్లో ఉండేది. నూతనంగా అమల్లోకి వచ్చిన బయోమెట్రిక్ విధానంతో ఇది పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇప్పటివరకు అధ్యాపకులే విద్యార్థులకు హాజరు నమోదు చేసే వారు. దీని ఆధారంగానే విద్యార్థులను పరీక్షలకు అనుమతించేవారు. ఒకవేళ విద్యార్థుల హాజరు తక్కువగా ఉంటే వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరించేవారు. ఎక్కువ రోజులు అయితే పరీక్షలకు అనుమతించమని హెచ్చరించేవారు.

75శాతం హాజరు ఉంటేనే..

కొందరు ప్రిన్సిపల్స్ విద్యార్థికి ఏడాది వృథా అవుతుందనే ఉద్దేశంతో.. తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు హాజరు సరి చేసేవారు. ప్రస్తుతం బయోమెట్రిక్ సిస్టమ్​లో విద్యార్థి కళాశాలకు వస్తేనే హాజరు నమోదు కానుంది. కాలేజీలో జరిగిన తరగతుల్లో.. 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షకు అనుమతిస్తారు. ఫలితంగా విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఉత్తీర్ణత శాతంపై ప్రభావం..

రాష్ట్రంలో 2016 నుంచి డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్ విధానం అమల్లోకి వచ్చింది. జూన్ నుంచి నవంబర్ వరకు మొదటి సెమిస్టర్​, డిసెంబర్ నుంచి మే వరకు రెండో సెమిస్టర్​గా విభజించారు. ఈ ఏడాది రెండో సెమిస్టర్ నుంచి బయోమెట్రిక్ ద్వారా హాజరు విధానం కచ్చితంగా అమలు చేస్తున్నారు. గతంలో తరగతులకు హాజరుకాని వారు కూడా పరీక్షలకు హాజరయ్యారు. ఈ ప్రభావం ఉత్తీర్ణత శాతంపై పడింది.

హాజరు తగ్గితే అంతే..

నూతన విధానంలో పరిస్థితిలో మార్పు రానుందని కళాశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. కళాశాల సమయం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు కాగానే గేట్లు మూసివేస్తున్నారు. హాజరు తగ్గితే సెమిస్టర్ పరీక్షలను అనుమతి ఉండదని తరగతి గదిలోనే విద్యార్థులకు తెలియజేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధ్యాపకులతో విద్యార్థుల హాజరు శాతంపై ప్రధానోపాధ్యాయులు సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఇవీ చూడండి:ఉచితంగా క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తున్నారా?

ABOUT THE AUTHOR

...view details