తెలంగాణ

telangana

ETV Bharat / city

డెస్టినేషన్ వెడ్డింగ్​ నుంచి కాక్​టైల్ పార్టీ వరకు... - hyderabad fashion

పెద్ద పెద్ద చెవి దుద్దులు... మెడ నిండా నగలు... చేతి ఐదు వేళ్లకు ఉంగరాలు మణికట్టు గొలుసులు ఇదంతా అవుట్​ డేటెట్​ ఫ్యాషన్. చెవికి లాంగ్ ఇయర్ రింగ్స్, చేతికి భారీ సైజులో ఉండే ఉంగరాలు నేటితరం మార్క్ . డెస్టినేషన్ వెడ్డింగ్ మొదలు కొని... కాక్ టైల్ పార్టీ వరకు ఇప్పుడు ప్రతి సందర్భం కోసం యువతరం ఇష్టపడుతోంది ఈ భారీ ఉంగరాలనే.

డెస్టినేషన్ వెడ్డింగ్​ నంచి కాక్​టైల్ పార్టీ వరకు...

By

Published : Nov 10, 2019, 6:11 AM IST

Updated : Nov 10, 2019, 12:48 PM IST

డెస్టినేషన్ వెడ్డింగ్​ నుంచి కాక్​టైల్ పార్టీ వరకు...
నడిచొచ్చే నగల దుకాణంలా తయారవటం నిన్నటి ఫ్యాషన్... స్టేట్మెంట్ జ్యువెల్లరీతో మెరిసిపోవటమే నేటి ఫ్యాషన్ అంటున్నారు యువతరం. ముఖ్యంగా నాజుకు చేతుల అందంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందుకే బ్రాస్​లెట్​లకు బై బై చెబుతున్నారు. సన్నని ఉంగరాలకు చెక్ పెడుతూ... భారీ సైజు ఉంగరాలపై మనసు పారేసుకుంటున్నారు. తమలపాకులాంటి సన్నని వేళ్లకు మోయలేని బరువున్న ఉంగరాలే అందం అంటూ భారీ ఉంగరాలను వేలికి తొడిగేస్తున్నారు. అంతేకాదు ఎలాంటి దుస్తులపైకి అయినా ఒక్క ఉంగరం చాలు ఫ్యాషనబుల్​గా ఉంటుందని వివరిస్తున్నారు.

వినూత్న రీతిలో ఫింగర్ రింగ్స్​...

యువతుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకునే డిజైనర్లు సైతం ప్రత్యేకంగా ఉంగరాల తయారీపై దృష్టి సారిస్తున్నారు. లీఫ్ డిజైన్, నెమలి, పులి, సింహం, పాండా, వాచ్ స్టైళ్లలో ఉంగరాలను తయారుచేస్తున్నారు. క్లస్టర్, కాక్ టెయిల్, నగ్గెట్, వింటేజ్ రింగ్స్ ఇప్పుడు నవతరం ఫ్యాషన్​లో భాగమైపోయాయి. మరీ ముఖ్యంగా వేలుమొత్తం కవర్ అయ్యేలా ఉండే ఫుల్ ఫింగర్, హేవీ సైజ్​లో ఉండే స్టోన్ రింగ్స్​కి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

మీరు లుక్కేయండి...

మీకూ సరికొత్త ఫ్యాషన్ల పట్ల ఆసక్తి ఉంటే ఓ సారి ఈ భారీ ఉంగరాలవైపు లుక్కేయండి. బంగారం, వెండిని తలదన్నేలా... వివిధ రకాల స్టోన్లతో అందంగా తీర్చిదిద్దిన భారీ ఉంగరాలు.. నచ్చిన సైజ్ లో మెచ్చె డిజైన్లతో మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

Last Updated : Nov 10, 2019, 12:48 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details