ఏ లక్ష్యాలతో రాష్టాన్ని సాధించుకున్నామో.. ఆ లక్ష్యం నెరవేరడం లేదని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత భట్టి విక్రమార్క అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరుద్యోగ సెమినార్లో ఆయన పాల్గొన్నారు. 'ఏడేండ్ల కేసీఆర్ పాలనలో ఆగమైన విద్యార్థి, నిరుద్యోగ బతుకులు' అనే అంశంపై చర్చించారు.
ఉద్యోగమూ హక్కే..
రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయిందని భట్టి విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. పాత భవనాలను పునర్నిర్మాణం చేయడానికే రాష్టాన్ని తెచ్చుకున్నట్లు ఉందన్నారు. ప్రతి ఏడాది బడ్జెట్లో విద్యకు నిధులు తగ్గుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపైన శాసనసభలో ప్రశ్నిస్తానన్నారు. రాష్టాన్ని సాధించడమూ, ఉద్యోగం తెచ్చుకోవడమూ మన హక్కేనన్నారు.