భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుసంధానంగా ఉన్న భైరవకోనలో(Bhairavakona temple and waterfalls) జలపాతం ఆహ్లాదకరంగా దర్శనమిస్తోంది. ఎత్తైన కొండల నుంచి జాలువారే నీరు.. భైరవకోనలోని శివలింగంపై పడుతూ స్వామి వారికి అభిషేకిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ దృశ్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చే భక్తులు భైరవకోనకు వెళ్లి.. జలపాతాన్ని వీక్షించి ఆనందభరితులవుతున్నారు.
Bhairavakona temple and waterfalls: కొండల మధ్య నుంచి జాలువారుతూ.. శివలింగాన్ని అభిషేకిస్తూ..
కొండలు, చెట్ల మీదనుంచి జాలువారుతున్న గంగమ్మ.. కిందకు దూకి శివలింగంపై పడి స్వామివారిని అభిషేకిస్తోంది. ఈ అద్భుత ఘట్టం భైరవకోనలో(Bhairavakona temple and waterfalls) ఆవిష్కృతమైంది. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు.
కొండల మధ్య నుంచి జాలువారుతూ..