హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య తమను ఎంతో బాధించందని... బెజవాడ బార్ అసోసియేషన్ తెలిపింది. మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డుపై ప్రజలందరు చూస్తుండగా నరికి చంపటం క్రూరమైన చర్యగా అభివర్ణించారు. వామనరావు దంపతులను నరికేస్తుంటే మిగత మనుషులు మౌనంగా ఉండటాన్ని ఖండించారు.
'నడిరోడ్డుపై నరికేస్తుంటే... స్పందించకుండా వీడియోలు తీస్తారా?' - బెజవాడ బార్ అసోసియేషన్
హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య జరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రజల తీరును బెజవాడ బార్ అసోసియేషన్ ఖడించింది. ... ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హెచ్చార్సీని కోరింది.
bejawada bar association complaint to hrc on lawyer couple suicide
కనీసం ఇద్దరు, ముగ్గురు కదిలి ఉంటే వారి ప్రాణాలకు రక్షించేవారని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రోడ్డుపై ప్రాణాలతో కొట్టుకుంటున్నా చాలా సేపటి వరకు ఎవరు రాకుండా... వీడియోలు మాత్రం తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు స్పందించాలని... ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హెచ్చార్సీని కోరారు. స్పందించిన హెచ్చార్సీ తదుపరి విచారణనను ఏప్రిల్ ఆరో తేదికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: కేసు ఓడిపోయాడని న్యాయవాదిపై హత్యాయత్నం
Last Updated : Feb 23, 2021, 4:16 PM IST