Man saved from drowning in RK Beach: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగిన ఓ వ్యక్తి అలల తీవ్రతకు కొట్టుకుపోతుండగా.. బీచ్‌లోని పోలీసులు, కమ్యూనిటీ గార్డులు కాపాడారు. హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల మహమ్మద్ అబ్దుల్ నయీమ్.. స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు. తుపాన్ నేపథ్యంలో.. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో సముద్రంలో దిగిన నయీమ్ కొట్టుకుపోతుండగా.. పోలీసులు డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించారు. గజ ఈత గాళ్ల ద్వారా ఆ వ్యక్తిని కాపాడారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి.. అబ్దుల్‌ను కాపాడిన సిబ్బందిని స్థానికులు అభినందించారు.
Man saved from drowning in RK Beach: ఆర్కే బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఎలా కాపాడారంటే..? - Man saved from drowning in RK Beach
Man saved from drowning in RK Beach: విశాఖలోని ఆర్కే బీచ్‌లో అలల ఉద్ధృతికి.. ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా పోలీసులు కాపాడారు. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ నయీమ్.. స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో.. నయీమ్ నీటిలో కొట్టుకుపోతుండగా.. పోలీసులు గమనించి అతడిని కాపాడారు.
Man saved from drowning in RK Beach