Ashok Gajapathi raju On Govt: ఏపీలోని విజయనగరం జిల్లా బోడికొండపై ఉన్న కోదండ రామాలయ నిర్మాణం కోసం జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత చెలరేగింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. ప్రభుత్వం శంకుస్థాపన చేయడం ఏంటని ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. ధర్మకర్తల మండలితో చర్చించకుండానే ప్రభుత్వం.. ఆలయ పునర్నిర్మాణం చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తరఫున ఏర్పాటు చేసిన పునర్నిర్మాణ, శంకుస్థాపన శిలాఫలకాలను తోసేశారు. స్పందించిన అధికారులు అశోక్ గజపతిరాజును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో అధికారులు.. అశోక్‌కు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కోదండ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మంత్రులు వెల్లంపల్లి, బొత్స నారాయణలు గుడికి వచ్చారు.
Ashok Gajapathi raju On AP Govt: బోడికొండపై ఉద్రిక్తత.. ఆలయ శంకుస్థాపనపై గజపతిరాజు గరంగరం - temple
Ashok Gajapathi raju On Govt: ఏపీలోని విజయనగరం జిల్లాలో బోడికొండపై కోదండ రామాలయ నిర్మాణం కోసం జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత చెలరేగింది. తనకు తెలియకుండానే ఆలయ పునర్నిర్మాణం చేపట్టడంపై ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూ ధర్మాన్ని కాపాడాలి..!
Ashok Gajapathi raju: దేవదాయ శాఖ ఆనవాయితీని వైకాపా ప్రభుత్వం పాటించట్లేదని అశోక్ గజపతిరాజు అన్నారు. ట్రస్టు బోర్డులను గౌరవించే పరిస్థితి ఈ సర్కారుకు లేదని విమర్శించారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరారు. అలాగే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై 147 దాడులు జరిగాయని.. ఈ ఘటనల్లో ప్రభుత్వం ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోయిందని అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణం ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పి... ఏడాది తర్వాత శంకుస్థాపన చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని.. ఆలయ పునర్నిర్మాణంలో నిబంధనలు పాటించట్లేదని చెప్పారు. అమరావతి రైతుల మాదిరిగానే తనను కూడా ప్రభుత్వాధికారులు వేధిస్తున్నారని అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు.