తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రభుత్వానికి దుబ్బాకపై ఉన్న ఆసక్తి.. టెట్​ నిర్వహణపై లేదు' - ఆర్​. కృష్ణయ్య తాజా వార్తలు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40వేల ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్య డిమాండ్​ చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా... ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లు తెరవాలని.. టెట్ నిర్వహించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. లేని పక్షంలో నిరుద్యోగులను ఐక్యం చేసి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.

bc welfare national president r krishnaiah demands to conduct teat exam
'ప్రభుత్వానికి దుబ్బాకపై ఉన్న ఆసక్తి.. టెట్​ నిర్వహణపై లేదు'

By

Published : Sep 5, 2020, 4:07 PM IST

రాష్ట్ర ప్రభుత్వానికి దుబ్బాక ఎమ్మెల్యే సీటుపై ఉన్న ఆసక్తి... ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా... రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ... తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో లక్డీ-కా-పుల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో ఆర్​.కృష్ణయ్య పాల్గొని మద్దతు తెలిపారు.

టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు లేరనే సాకుతో 4,600 ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ... విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్ళు తెరవాలని, టెట్ నిర్వహించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. లేని పక్షంలో నిరుద్యోగులను ఐక్యం చేసి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.

ఇవీ చూడండి:కరోనా పరీక్షలు వాళ్లందరికీ చేయాల్సిందే: ఐసీఎంఆర్

ABOUT THE AUTHOR

...view details