వరదలతో అతలాకుతలమవుతున్న భాగ్యనగర వాసులను ఆదుకునేందుకు పలువురు విరాళాలు ప్రకటిస్తూ.. ఉదారత చాటుకుంటున్నారు. వరద సహాయక చర్యల కోసం పశ్చిమ బంగా ప్రభుత్వం రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. భారీ వర్షాల వల్ల తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం బాధాకరమన్న దీదీ... వర్షాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాష్ట్రానికి బంగాల్ ముఖ్యమంత్రి రూ.2 కోట్ల సాయం
భారీ వర్షాలతో అల్లాడుతున్న తెలంగాణను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తాజాగా బంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రానికి రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. వర్షాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు దీదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాష్ట్రానికి బంగాల్ ముఖ్యమంత్రి రూ.2 కోట్ల సాయం
విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు బంగాల్ ప్రజలు అండగా ఉంటారని అన్నారు. సోదరభావంతో రూ. రెండు కోట్ల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. దీదీతో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చూడండి:విరాళాల వెల్లువలు... ఆపదలో సినీ ప్రముఖుల ఆపన్నహస్తం