తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం కేసీఆర్‌కి రాజకీయాలు తప్పితే పేదల బాధలు పట్టవు: బండి సంజయ్ - కుని బాధితులను పరామర్శించిన బండి సంజయ్

Bandi Sanjay: కుటుంబ నియంత్రణ చికిత్సతో నలుగురి ప్రాణాలు పోయిన ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యుడిని చేస్తూ... వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెంటనే బర్తరఫ్‌ చేయాలని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రికార్డు కోసం గంటలో 34 శస్త్రచికిత్సలు చేసి... నలుగురు ప్రాణాలు తీశారని ఆరోపించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని బండి పరామర్శించారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : Aug 31, 2022, 3:12 PM IST

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వం రికార్డు కోసం గంటలో 34 కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్లు చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. మహిళలకు ఆపరేషన్‌ చేసే ముందు కనీస పరీక్షలు చేయలేదన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసే ముందు కనీసం ప్రాథమిక పరీక్షలు కూడా చేయలేదని విమర్శించారు. మృతుల కుటుంబాలను సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఎందుకు పరామర్శించలేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

'కు.ని చికిత్సలతో నలుగురు మహిళల మృతికి తెరాస ప్రభుత్వమే కారణం. మృతుల కుటుంబాలను సీఎం పరామర్శించకుండా బిహార్‌ పర్యటనకు వెళ్లారు. కేసీఆర్‌కి రాజకీయాలు తప్ప పేదల బాధలు పట్టవు. ఈ 8 ఏళ్లలో కేసీఆర్‌ ఒక్క పేద కుటుంబాన్ని అయినా పరామర్శించారా? మంత్రులు, ఎమ్మెల్యేలు బాధితులను ఎందుకు పరామర్శించలేదు? వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అబద్ధాల మంత్రిగా మారిపోయారు. కు.ని.చికిత్సలతో మృతిచెందిన మహిళల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇవ్వాలి.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details