భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6వ గనిలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం బాధాకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పనిచేసే చోట కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే పైకప్పు కూలిందని ఆరోపించారు. అధికారులు అండర్ గ్రౌండ్ మైనింగ్‌లో భద్రతా నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు.
'రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే గనిలో ప్రమాదం' - bjp telangana state president
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6వ గనిలో జరిగిన ప్రమాదానికి రక్షణ చర్యలు తీసుకోకపోవడమే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్, కేటీకే ప్రమాదం, భూపాలపల్లి గని ప్రమాదం
ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంఖ్య తగ్గించి, ఉత్పత్తి పెంచి.. శారీరక, మానసిక ఒత్తిడి పెంచుతున్నారని విమర్శించారు. లాభాలే లక్ష్యంగా కాకుండా.. కార్మికుల భద్రతకు పెద్దపీట వేయాలని విజ్ఞప్తి చేశారు.