Bandi sanjay fires on CM Kcr: భాజపా వస్తే మీటర్లు పెడతారని కేసీఆర్ బెదిరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరమే లేదని నిరూపిస్తామని సంజయ్ పేర్కొన్నారు. రైతుల్ని భాజపా ఇబ్బంది పెడుతున్నట్లు ఆధారాలు చూపించగలరా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ నిజం చెప్పరు.. నోరు విప్పితే అబద్ధాలే చెబుతారని బండి సంజయ్ అన్నారు.
మోటార్లకు మీటర్లు అక్కర్లేదని నిరూపిస్తామన్న బండి సంజయ్ - కేసీఆర్ పై మండిపడిన బండి సంజయ్
Bandi sanjay fires on CM Kcr ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ నిజం చెప్పరు, నోరు విప్పితే అబద్ధాలే చెబుతారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాజపా వస్తే మీటర్లు పెడతారని కేసీఆర్ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మోటార్లకు మీటర్లు అక్కర్లేదని నిరూపిస్తామని సంజయ్ పేర్కొన్నారు. రైతుల్ని భాజపా ఇబ్బంది పెడుతున్నట్లు ఆధారాలు చూపించగలరా అని ప్రశ్నించారు.
Bandi sanjay
మోటార్లకు మీటర్లు పెట్టాలనే కేసీఆర్ ఆలోచన వెనుక కుట్ర ఉందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ ఇవ్వడం కేసీఆర్‌కు చేతకావట్లేదు.. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది.. ప్రభుత్వం దగ్గర పైసల్లేవు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. విద్యుత్ సంస్థల వద్ద రూ.50 వేల కోట్లు అప్పు చేశారు.. అప్పు తీర్చకపోతే రాష్ట్రంలో డిస్కంలన్నీ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని సంజయ్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: