తెలంగాణ

telangana

ETV Bharat / city

అక్రమ చొరబాటుదార్లపై సర్జికల్​ స్ట్రైక్​ తప్పదు: బండి సంజయ్​ - జీహెచ్​ఎంసీ ఎన్నికలు

మంత్రి కేటీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ట్విట్టర్​ ద్వారా మండిపడ్డారు. చొరబాటుదార్ల ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని తెరాస పగటి కలలు కంటోందని ఆయన ఆరోపించారు. అక్రమ చొరబాటుదార్లపై సర్జికల్​ స్ట్రైక్​ తప్పదని బండి స్పష్టం చేశారు.

అక్రమ చొరబాటుదార్లపై సర్జికల్​ స్ట్రైక్​ తప్పదు: బండి సంజయ్​
అక్రమ చొరబాటుదార్లపై సర్జికల్​ స్ట్రైక్​ తప్పదు: బండి సంజయ్​

By

Published : Nov 24, 2020, 10:27 PM IST

అక్రమ చొరబాటుదార్ల పై 'సర్జికల్ స్ట్రైక్' తప్పదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. విదేశీ చొరబాటుదార్ల ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని తెరాస పగటి కలలు కంటోందని ఆయన విమర్శించారు. కేవలం విదేశీ విద్రోహుల మీద కాకుండా తెలంగాణ దోపిడీ దొంగల మీద కూడా సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పారు.

అవినీతి, కుటుంబస్వామ్యం, గుత్తేదారుల వేల కోట్ల దోపిడిమీద కూడా సర్జికల్ స్ట్రైక్ ఉంటుందన్నారు. మద్యం తాగి ప్రభుత్వాన్ని నడపడం రాష్ట్రానికి ప్రమాదకరమని... చొరబాటుదార్ల ఓట్లతో గెలవాలని చూడడం దేశానికి ప్రమాదకరమని బండి చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్​పై మండిపడ్డారు.

ఇవీ చూడండి: భాజపా నేతలు హైదరాబాద్‌లో చిచ్చుపెట్టాలనుకుంటున్నారా..? : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details