తెలంగాణ

telangana

ETV Bharat / city

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్ అరెస్ట్​

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..  బండి సంజయ్ అరెస్ట్​
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్ అరెస్ట్​

By

Published : Sep 11, 2020, 12:32 PM IST

Updated : Sep 11, 2020, 2:09 PM IST

12:31 September 11

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్ అరెస్ట్​

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్ అరెస్ట్​

తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి భాజపా పిలుపునివ్వడంతో ఆపార్టీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అసెంబ్లీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ... అసెంబ్లీ పరిసర ప్రాంతాల వరకు భాజపా నాయకులు, మహిళా మోర్చా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నాంపల్లి, బషీర్‌బాగ్‌, పోలీస్ కంట్రోల్‌ రూమ్‌ ముందు పోలీసులు భాజనేత కె.లక్ష్మణ్‌, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తితో పాటు పలువురిని  బలవంతంగా అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు.  బండి సంజయ్‌ను తరలిస్తున్న వాహనానికి భాజపా కార్యకర్తలు అడ్డంగా పడుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులను అడ్డుకున్న కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్​స్టేషన్​కు ‌ తరలించారు.

అసెంబ్లీ ముట్టడి విజయవంతం: బండి  సంజయ్‌

 భాజపా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని బండి సంజయ్​ తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన భాజపా... నిజాం, రజాకార్ల పక్షాన కేసీఆర్‌ ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలన్న ప్రజల డిమాండ్‌  అసెంబ్లీ ముట్టడితో మరోసారి రుజువయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల బలప్రయోగంతో భాజపా నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. త్వరలోనే కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేస్తామని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:కొండగట్టు ప్రమాదానికి రెండేళ్లు... ఇప్పటికీ కోలుకోని బాధితులు

Last Updated : Sep 11, 2020, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details