బండారు దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు దత్తాత్రేయ తెలిపారు. ప్రజా జీవితంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా అనేక హోదాల్లో పనిచేసినట్లు గుర్తు చేశారు. గవర్నర్‌గా రాజ్యాంగబద్ధపదవిలో ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
గవర్నర్‌గా ప్రజలతో మమేకమయ్యా: దత్తాత్రేయ
ప్రజలతో మమేకమై పని చేస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాల గురించి పంచుకున్నారు.
bandaru dattatreya
విశ్వవిద్యాలయాల కులపతిగా హిమాచల్‌ప్రదేశ్‌లోని అన్ని వర్సిటీలను సందర్శించి... విద్యార్థులతో మాట్లాడినట్లు దత్తాత్రేయ తెలిపారు. గిరిజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్లు వివరించారు. ఫార్మా రంగ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించినట్లు వెల్లడించారు. ప్రజలతో మమేకమై పని చేస్తున్నట్ల పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'పేదలు భూములు పోగొట్టుకోకుండా సమస్యలు పరిష్కరించాలి'