తెలంగాణ

telangana

ETV Bharat / city

Black Fungus : కరోనా సోకకపోయినా.. బ్లాక్ ఫంగస్ బారినపడ్డ బాలుడు

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన 18 నెలల బాలుడు కరోనా సోకకపోయినా బ్లాక్​ ఫంగస్ బారినపడ్డాడు. కాకినాడ జీజీహెచ్‌ వైద్యులు గురువారం శస్త్రచికిత్స చేసి ఫంగస్‌ తొలగించారు.

black fungus, black fungus in ap,black fungus in west godavari
బ్లాక్ ఫంగస్, ఏపీలో బ్లాక్ ఫంగస్, పశ్చిమ గోదావరిలో బ్లాక్ ఫంగస్

By

Published : Jun 4, 2021, 8:13 AM IST

రోనా లేదని పరీక్షల్లో తేలినా.. ఓ బాలుడు బ్లాక్‌ ఫంగస్‌ బారినపడ్డాడు. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేసి ఫంగస్‌ తొలగించారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన దంపతుల 18నెలల కుమారుడు జానకినందన్‌లో గత నెల 28న బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించాయి. అంతకుముందే జానకినందన్‌ తండ్రికి కరోనా సోకడంతో హోం ఐసొలేషన్‌లో ఉండి కోలుకున్నారు. అప్పట్లో ఈ బాలుడికి పరీక్షలు చేయగా నెగెటివ్‌గా తేలింది. కానీ, ఫంగస్‌ లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు అతన్ని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు.

మళ్లీ కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్‌గా రిపోర్టు వచ్చింది. అప్పటి నుంచి ఫంగస్‌ నివారణకు చికిత్స చేస్తున్న కాకినాడ జీజీహెచ్‌ వైద్యులు గురువారం శస్త్రచికిత్స చేశారు. ఈఎన్‌టీ విభాగాధిపతి డా.కృష్ణకిషోర్‌ ఆధ్వర్యంలో ఆప్తమాలజీ విభాగాధిపతి డా.మురళీకృష్ణ, ఇతర విభాగాలకు చెందిన వైద్యనిపుణులు సర్జరీతో సైనస్‌, చెంప, కన్ను తదితర చోట్ల ఉన్న ఫంగస్‌ను తొలగించారు.

ABOUT THE AUTHOR

...view details