తెలంగాణ

telangana

ETV Bharat / city

గోవుకు ఘనంగా సీమంతం.. ముత్తైదువలకు ఆహ్వానం - baby shower function to cow news

గోమాతను ఇళ్లల్లో పెంచుకోవటం సాధారణం. ప్రత్యేకంగా పూజలు చేయటం కూడా చూస్తుంటాం. కానీ.. ఏపీ గుంటూరు జిల్లా ఇస్సపాలెంలో బెల్లంకొండ దంపతులు తాము ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న గోమాతకు అంగరంగ వైభవంగా సీమంతం జరిపించారు. ముత్తైదువలను ఆహ్వానించి పసుపుకుంకుమలు సమర్పించారు.

baby-shower-function-to-cow-in-issapalem-guntur-district
గోవుకు ఘనంగా సీమంతం.. ముత్తైదువలకు ఆహ్వానం

By

Published : Feb 28, 2021, 4:16 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో గోమాతకు సీమంతం వేడుక నిర్వహించారు. గ్రామానికి చెందిన బెల్లంకొండ బాజి, నాగలక్ష్మి, బెల్లంకొండ ఈశ్వరరావు, అరుణ అనే రెండు కుటుంబాల దంపతులు ఈ కార్యక్రమం జరిపించారు. రెండు రోజుల ముందుగా గ్రామస్థులకు ఆహ్వాన పత్రికలను అందించారు. దంపతుల స్వగృహం వద్ద మండపం ఏర్పాటు చేసి వేడుక నిర్వహించారు.

తమ ఇష్ట దైవంగా కొలుచుకుంటూ రెండేళ్ల నుంచి పెంచుకుంటున్న గోవుకు వేడుక జరిపించటం ఆనందంగా ఉందని వేడుక నిర్వహించిన దంపతులు అన్నారు. గోమాత ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే సీమంతం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని నూట ఎనిమిది మంది ముతైదువులు హాజరయ్యారు. మహిళలు గోవుకు చీరసార, పసుపు కుంకుమలు సమర్పించారు. వేడుకకు వచ్చిన వారికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు దంపతులు తెలిపారు.

ఇదీ చదవండి:భాజపా ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డివిరుస్తోంది: కారెం

ABOUT THE AUTHOR

...view details