తెలంగాణ

telangana

ETV Bharat / city

'సిలబస్‌ తగ్గింపు.. విద్యార్థుల ఇంటి వద్దకే పుస్తకాలు' - అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ వార్తలు

కరోనా విపత్తు నేపథ్యంలో కొత్త విద్యాసంవత్సరంలో పాఠశాలలు పనిదినాలు తగ్గనున్న తరుణంలో ఆ మేరకు పాఠ్య ప్రణాళికలోనూ మార్పులు చేయాలని అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ పేర్కొంది. విద్యార్థుల ఇంటి వద్దకే అవసరమైన పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, పాఠ్యాంశాల మెటీరియల్‌ అందించాలని సూచించింది. పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి బడ్జెట్‌లో అదనంగా కేటాయించి ఖర్చు చేయాలంది. గతంలో నేర్చుకున్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటూ రాబోయే ఏడాదికి సిద్ధమయ్యేలా పాఠ్యాంశాలు గుర్తించి మెటీరియల్‌ సిద్ధం చేయాలని సూచించింది. ‘కరోనా సమయంలో పాఠశాలలు- కీలకమైన అంశాల్లో ఏం చేయాలి’ పేరిట అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది.

'సిలబస్‌ తగ్గింపు.. విద్యార్థుల ఇంటి వద్దకే పుస్తకాలు'
'సిలబస్‌ తగ్గింపు.. విద్యార్థుల ఇంటి వద్దకే పుస్తకాలు'

By

Published : Jun 22, 2020, 7:15 AM IST

విద్యార్థుల సంఖ్య ఎక్కువైతే...

ముఖాముఖి ద్వారానే విద్యార్థులు ఎక్కువగా పాఠ్యాంశాలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టెక్నాలజీనే బోధనకు ప్రత్యామ్నాయం. కరోనా బారిన పడిన కుటుంబాల్లోని పిల్లలందరికీ పాఠశాలల్లో స్థానం కల్పించాలి. ఉమ్మడి పాఠ్యప్రణాళిక సిద్ధం చేయాలి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా రద్దీ, తక్కువ రద్దీ కేటగిరీలుగా పాఠశాలల్ని విభజించాలి. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో ఉన్నప్పటికీ రద్దీ ఎక్కువగా ఉంటే విద్యార్థులకు రోజు విడిచి రోజు లేదా షిఫ్టుల పద్ధతిలో తరగతులు నిర్వహించాలి. ప్రతి వారం నిర్దేశించిన రోజున చెప్పిన తరగతుల విద్యార్థులు మాత్రమే హాజరుకావాలి. తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు భోజనం ఇవ్వడంతో పాటు పాఠశాలకు రాని వారికి రేషన్‌ సరకులు, ఆహార ప్యాకెట్లు అందించాలి.

తరగతుల నిర్వహణ నమూనా..

  • సిలబస్‌ తగ్గింపులో తప్పనిసరి బోధించాల్సిన అంశాలను గుర్తించి, మిగతా విషయాలను సాధారణంగా చదువుకునే అవకాశమివ్వాలి.
  • ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రగతిని మదింపు చేయాలి. వార్షిక పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకుంటే ఈ మదింపుతో గ్రేడ్‌లు కేటాయించే వీలుంది.
  • 1-3 తరగతులకు వారానికి 5 గంటలు బోధన ఉండాలి. భాషలు, గణితంపై దృష్టి పెట్టాలి.
  • 4-5 తరగతులకు వారానికి 6 గంటల బోధన సమయాన్ని కేటాయించాలి. భాషలు, గణితం, పర్యావరణంపై పాఠాలు ఉండాలి.
  • 6-8 తరగతులకు వారానికి 10 గంటల బోధన జరగాలి. భాషలు, గణితం, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌పై దృష్టిపెట్టాలి.
  • 9-10 తరగతుల విద్యార్థులకు ప్రతి సబ్జెక్టుకు వారానికి 3 గంటల చొప్పున బోధన సమయం కేటాయించాలి. పాఠశాలతో పాటు ఇంట్లోనూ స్వీయ శిక్షణ కలిపి ఈ బోధన గంటలు నిర్ణయించారు.

ప్రభుత్వ యంత్రాంగం చేయాలిలా..

  • జిల్లా విద్యాధికారులు స్థానిక పరిస్థితుల నిబంధనలు, నియమాలు జారీ చేయాలి.
  • పాఠశాల విద్యార్థులు, టీచర్లు, సిబ్బందికి సబ్బు, నీళ్లు, మాస్కులు అందుబాటులో ఉండాలి.
  • ఎస్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాల రూపకల్పనతో పాటు పది పరీక్షలకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలి.
  • పాఠశాల విద్యాశాఖ రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల ఆధారంగా పాఠశాలల నిర్వహణకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలి.

ఈ-బోధనలో ఆటంకాలు..

  • స్మార్ట్‌ఫోన్‌తో పుస్తకాలు చదవడం, పెద్ద జవాబులు రాయడం ఇబ్బంది.
  • గ్రామీణ ప్రాంతాల్లోని 10 శాతం కుటుంబాలకే స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.
  • తల్లిదండ్రులు ఫోన్లు తీసుకుపోవడంతో పిల్లలకు అందుబాటులో ఉండవు.
  • ప్రస్తుతం 42 శాతం పట్టణ, 15 శాతం గ్రామీణ ప్రజలకు ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంది.
  • విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో ఇబ్బంది.

ఇవీ చూడండి:రాజధానిపై విరుచుకుపడుతున్న కరోనా

ABOUT THE AUTHOR

...view details