కరోనా మూడో దశ(Corona Third Wave) ముప్పు పొంచి ఉన్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ రావు ఈఎన్టీ ఆస్పత్రి ఆధ్వర్యంలో అవగాహన నడక నిర్వహించారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో నిర్వహించిన ఈ వాక్‌లో.. ఆస్పత్రి ఛైర్మన్ జీవీఎస్ రావు, డైరెక్టర్ శ్రీరావు పాల్గొన్నారు.
Corona Third Wave : 'మూడో ముప్పును ధైర్యంగా ఎదుర్కోవాలి' - Hyderabad news 2021
మూడో దశ కరోనా(Corona Third Wave)ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సన్నద్ధం కావాలని.. డాక్టర్ రావు ఈఎన్టీ ఆస్పత్రి ఛైర్మన్ జీవీఎస్ రావు సూచించారు. మూడో ముప్పు పొంచి ఉన్నందున అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ కూకట్‌పల్లిలో నడక నిర్వహించారు.
Corona Third Wave
రోడ్డుపై మాస్కులను పంపిణీ చేస్తూ.. కరోనా మూడో దశ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని చెప్పారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం.. భౌతిక దూరం పాటించడం.. అనవసరంగా.. గుంపులు గుంపులుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.