తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆటోలో బ్యాగు.. అందులో చూస్తే భారీగా బంగారం.. డ్రైవర్​ ఏం చేశాడంటే.!

Auto driver honesty: ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనిలో.. ఓ ఆటో డ్రైవర్ నిజాయతీని చాటుకుని పోలీసుల రివార్డును అందుకున్నారు. తన ఆటోలో మరిచిపోయిన ఓ ప్రయాణీకురాలి బ్యాగ్​ను.. పోలీసులకు అప్పగించి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. అందులో 25 తులాల బంగారంతో పాటు నగదు ఉందని పోలీసులు తెలిపారు.

Auto driver honesty
ఆటో డ్రైవర్​ నిజాయతీ

By

Published : Feb 11, 2022, 8:01 PM IST

Auto driver honesty: ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆదోనిలో 25 తులాల బంగారం తిరిగిచ్చి.. ఓ ఆటోడ్రైవర్ నిజాయతీ చాటుకున్నారు. ఆటోలో మరిచిపోయిన ప్రయాణీకురాలి బ్యాగ్​ను పోలీసులకు అప్పగించారు. పట్టణానికి చెందిన శైలజ అనే మహిళ.. డ్రైవర్​ ఖాజా మొద్దీన్ ఆటోలో ఎక్కింది. తన వెంట తెచ్చుకున్న బ్యాగును ఆటోలో మర్చిపోయి బస్టాండ్​కు వెళ్లింది.

బ్యాగును గమనించిన ఆటో డ్రైవర్.. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్​లో అప్పగించారు. అందులో 25 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సంబంధిత మహిళకు సమాచారం అందించి, బ్యాగును ఆమెకు అందించారు. నిజాయతీతో బ్యాగును అప్పగించిన ఆటోడ్రైవర్ ఖాజా మొద్దీన్​కు పోలీసులు రివార్డు అందించి అభినందించారు.

ఇదీ చదవండి:వైభవంగా సహస్రాబ్ది వేడుకలు... సందర్శించిన బాబా రాందేవ్

ABOUT THE AUTHOR

...view details