తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆస్ట్రేలియాలో పర్యటించాలని గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం - గవర్నర్ తమిళిసై వార్తలు

ఆస్ట్రేలియా, తెలంగాణ మధ్య వైద్య పర్యటకం, విద్య, సాంస్కృతిక రంగాలు మరింత బలోపేతం కావాలని గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ వచ్చిన ఆస్ట్రేలియా హైకమిషనర్ బారి రాబర్ట్ ఓ ఫరేల్ పుదుచ్చేరిలో ఉన్న తమిళిసైతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలు చర్చించారు. ఆస్ట్రేలియాలో పర్యటించాలని గవర్నర్ తమిళిసైని హై కమిషనర్ ఆహ్వానించారు.

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan

By

Published : Mar 12, 2021, 10:52 PM IST

భారత, ఆస్ట్రేలియా సంబంధాలు మరింత మెరుగుపడాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా, తెలంగాణ సంయుక్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు. హైదరాబాద్ వచ్చిన ఆస్ట్రేలియా హైకమిషనర్ బారి రాబర్ట్ ఓ ఫరేల్ పుదుచ్చేరిలో ఉన్న తమిళిసైతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలు చర్చించారు.

ఆస్ట్రేలియా, తెలంగాణ మధ్య వైద్య పర్యటకం, విద్య, సాంస్కృతి రంగాలు మరింత బలోపేతం కావాలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. పోచంపల్లి చీరలు, హైదరాబాద్ బిర్యానీ, తెలంగాణ హస్తకళలకు మంచి ప్రాచుర్యం ఉందని ఆమె ఆస్ట్రేలియా ప్రతినిధులకు వివరించారు. కొవిడ్ సమయంలో భారత వైద్యులు, వ్యాక్సిన్ రూపకల్పనలో శాస్త్రవేత్తల కృషి అభినందనీయమని ఆస్ట్రేలియా హైకమిషనర్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో పర్యటించాలని గవర్నర్ తమిళిసైని ఆయన ఆహ్వానించారు.

ఇదీ చదవండి :ప్రపంచ ఆలయాల్లో యాదాద్రి ప్రత్యేకత చాటుకోబోతోంది: సీఎం

ABOUT THE AUTHOR

...view details